24.7 C
Hyderabad
May 16, 2024 23: 36 PM
Slider ఖమ్మం

ఎండిపోతున్న పంటలు

#RAITHUSANGHAM

కొణిజర్ల మండలం సోమవరం మైనర్ ఆయకట్టు పరిధిలో మొక్కజొన్న, వరి పంట దారుణంగా ఎండిపోతున్న ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు స్పందించడం లేదని సాగర్ జలాలు సరఫరాలో వారాబంధి సడలించి ఆయకట్టు చివర భూములకు నిరంతరాయంగా సరఫరా చేయాలి అని  తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం బృందం  ఎండిపోతున్న పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ సాగర్ జలాలు సరఫరాలో వారాబంధి విధానాన్ని అమలు చేయడం వల్ల ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందడం లేదని  అన్నారు.వారాబంధి అన్ అండ్ ఆఫ్ పద్దతి లో నీరు విడుదల చేయడం వల్ల ఆయకట్టు ప్రారంభం లో ఉన్న రైతుల పంటలు కు మాత్రమే సాగు నీరు అందడం జరుగుతుంది అని ఆయకట్టు చివర లో ఉన్న రైతులు మొక్కజొన్న పంట కంకి వేసి గింజ పోసుకునే దశలో నీరు అందక ఎండిపోతుంది అని అన్నారు, పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని అధికారులు కనీసం కాల్వలు పైన తీరగడం లేదని అన్నారు,  జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెంటనే స్పందించి వారాబంధి విధానాన్ని ఎత్తివేసి ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు చెరకు మల్లి కుటుంబరావు, మండల నాయకులు చింతనిప్పు నరిసింహారావు, కస్టాల సురేష్, రైతులు తాతా నగేష్, తాతా రామారావు, అన్నేపోగు మార్క్,కాకర్ల జగన్ మోహన్ రావు, తాతా గోపయ్య,ఇల్లారపు మురళి, పాపగంటి వెంకటేష్,చింతనిప్పు నరిసింహారావు తదితరులు పాల్గొన్నారు

Related posts

వివేకా హత్యకేసులో మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీఐ

Satyam NEWS

డ్రైనేజి సమస్యల పరిష్కారానికి చర్యలు

Satyam NEWS

అత్యంత వైభవంగా ముగిసిన రజకుల ఆరాధ్య దేవతా ప్రతిష్ఠా మహోత్సవం

Satyam NEWS

Leave a Comment