24.7 C
Hyderabad
May 16, 2024 23: 45 PM
Slider ఖమ్మం

ధరలను అదుపు చేయటంలో  ప్రభుత్వం వైఫల్యం

#nunna

కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పాలన లో  దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. దేశంలో పెరిగిపోతున్ననిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో  విఫలమైందని విమర్శించారు. ఖమ్మం  సుందరయ్య భవన్ లో అఫ్రోజ్ సమీనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నున్నా మాట్లాడుతూ కోవిడ్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న సంకేతాలు వినిపించినా అది నిజం కాదని తేలిపోయింది. ఎక్కడ చూసినా ప్రతికూల సంకేతాలే కనిపిస్తున్నాయని ఆన్నారు. దేశంలో కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్యం నిల్వలు న్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పతనం కావడం చిన్న విషయం కాదని అన్నారు. దీని ప్రభావం పలురంగాలపై తీవ్రంగా ఉంటుందని చెప్పారు.

ముఖ్యంగా సామాన్యుడి జీవన చక్రానికి కీలకమైన గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు మరింతగా పెరగడం  పెట్రోల్‌ రేటు పెరిగితే అనివార్యంగా వస్తువుల రవాణ భారమవుతుందని దీంతో నిత్యవసరాల ధరలూ మరింత పెరుగుతాయని తెలిపారు. ఇప్పటికే ఆహారం, వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, దుస్తులు, పాదరక్షలు మొదలుకొని గృహౌపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు అన్నింటి ధరలూ విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ కొండెక్కి కూర్చుంటోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ తీసుకున్న రెపో రేటు పెంపు నిర్ణయం కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్నది నిపుణుల మాట. కాబట్టి ప్రభుత్వం ఇంధనంపై పన్నులతో పాటు జీఎస్టీని తగ్గించి, పేదలకు ఉచిత ఆహార పథకాలను విస్తరించి, ఎంఎస్‌ఎం ఈ రంగా నికి నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధికి ఊపునివ్వాలి. దాని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కేంద్రం ఇంత వరకూ ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదన్నారు.

నిజానికి కోవిడ్‌ తర్వాత మన ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. కోవిడ్‌ కాలంలో కుదేలైన పరిశ్రమలు, వ్యాపారాలు ఇంకా గాడిన పడలేదు. ఉద్యోగాలు కోల్పో యిన కోట్లాది మంది మళ్లీ పనిలో కుదురుకోలేదన్నారు. ఈ లోగానే ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవు తుండటం ప్రమాద ఘంటికల్ని మోగి స్తోంది. దేశంలో ఇప్పటికీ లేబర్‌ ఫోర్స్‌లో 40శాతం మంది మాత్రమే యాక్టివ్‌ అయ్యారు. ఇంకా 60శాతం మంది ఏం చేస్తున్నారో లెక్కల్లేవు. ఆర్థిక వ్యవస్థ కోవిడ్‌ ముందు నాటికి చేరుకోవాలంటే పుష్కర కాలం పడుతుందని అంచనా. దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు అంతకంతకూ పెరిగి పోతు న్నాయి. రాష్ట్రాల తలసరి ఆదాయం లోనూ విపరీతమైన తేడాలున్నాయని తెలిపారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఆర్థిక సర్వే రూపొందించడం కూడా చాలా కష్టమైపోతుంది. దేశంలో రాజకీయంగా పెరుగుతున్న సంక్లిష్టతలు కూడా పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి.

Related posts

మరణించిన నేతల కుమారులకు ఎమ్మెల్సీలు

Satyam NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుంటే కేటీఆర్ ఏంచేస్తున్నారు?

Satyam NEWS

Leave a Comment