39.2 C
Hyderabad
May 3, 2024 14: 09 PM
Slider మహబూబ్ నగర్

ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుంటే కేటీఆర్ ఏంచేస్తున్నారు?

#dkaruna

తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుప్ప కూలిపోయిందని, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండ్డిపడ్డారు. మంగళవారం పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకు కావడంపై డీకే అరుణ స్పందిస్తూ, పత్రిక ప్రకటన విడుదల చేసారు. మొన్న టీఎస్పీఎస్సీ, నిన్న పదవ తరగతి తెలుగు, నేడు హిందీ ప్రశ్నపత్రం లీకు అవుతుంటే ప్రభుత్వానికి దున్నపోతు పైన వాన పడ్డట్లు తయారైందని డీకే అరుణ విరుచుకుపడ్డారు.

ఈ ప్రభుత్వంలో ఎవరి శాఖకు ఎవరు మంత్రో కూడా అర్థం కావడం లేదని, అన్ని శాఖలకు తానే రాజు తానే మంత్రి అని స్పందించే ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్, ప్రశ్నపత్రాలు ఏకధాటిగా లీకులు అయితుంటే ఎందుకు స్పందించడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రభుత్వ అధికారుల  పై పట్టు కోల్పోయారని ఆమె ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కు కేవలం స్కీములు పేర్లు చెప్పాలే స్వాములు చేయాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నారని, అదే విధంగా తమ బిడ్డ పై ఉన్న ప్రేమలో, కనీసం పది శాతమైన తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి పై ఉంటే  బాగుండేదని డీకే అరుణ అన్నారు. లీకేజి వ్యవహారం పై ముఖ్యమంత్రి స్పందించి, నిందితులను సరైన విధంగా విచారణ చేపట్టి, వారి వెనుక ఉన్న అసలు సూత్రదారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.

Related posts

మూడేళ్ల వయసుకే ఓటు హక్కు ఇచ్చేశారు

Satyam NEWS

ఆర్థికాభివృద్ధి సాధించాలి

Murali Krishna

బిఎస్పి ములుగు జిల్లా ఇంచార్జి గా శనిగరపు నరేష్ కుమార్

Satyam NEWS

Leave a Comment