38.2 C
Hyderabad
May 3, 2024 20: 48 PM
Slider రంగారెడ్డి

“సైబరాబాద్ ప్రొటెక్షన్ గ్రూప్/CPG” ఏర్పాటు

#cybarabad

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ పరిధి లోని  CTC పరేడ్‌ గ్రౌండ్‌ లో ఈరోజు  ‘సైబరాబాద్ ప్రొటెక్షన్ గ్రూప్/CPG’  ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ సీపీ అవినాష్ మహంతి తో కలిసి ప్రారంభించారు. సైబరాబాద్ సీపీ గారు Cyberabad Protection Group (CPG) కొత్త ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. సీపీ సైబరాబాద్ సూచనల మేరకు సీపీజీలకు డిఫెన్స్ ట్యాక్టికల్ ట్రైనింగ్ లో ప్రత్యేకమైన శిక్షణను ఇచ్చారు. 

అందులో భాగంగా వీరికి ట్యాక్టికల్ ట్రైనింగ్ లో డిఫెన్సివ్  టెక్నిక్స్ ను నేర్పించారు. శిక్షణ అనంతరం వీరికి ఈరోజు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు/gear, స్పెషల్ ఎక్విప్మెంట్స్, ఈరోజు సీపీ అందజేశారు. CPG లు ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా & ఆర్డర్, డిజాస్టర్స్, ఫ్లడ్స్, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు L&O పోలీసు సిబ్బంది, క్రైమ్స్ పోలీస్ సిబ్బందితో కలిసి పని చేస్తారు. నేరనివారణక, నష్ట నివారణకు వారికి తగు సూచనలు చేయడంతో పాటు వెంటనే యాక్షన్ లోకి దిగుతారు.

ఈ టీమ్ లో ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ ర్యాంక్ వరకు పోలీసు సిబ్బంది ఉంటారు. ఈ టీమ్ లు అడ్మిన్ ఏసి‌పి మరియు ఆర్‌ఐ ల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ  ప్రజల ప్రాణాలకు భద్రత కల్పిస్తున్న పోలీసులు విధి నిర్వహణలో తక్షణ స్పందన చర్యలను చేపట్టేందుకు ఈ యొక్క   సైబరాబాద్ ప్రొటెక్షన్ గ్రూప్ డిఫెన్సివ్ ట్యాక్టికల్ ట్రైనింగ్, DRF శిక్షణ కేంద్రం నందు తగిన శిక్షణ, క్రౌడ్ కంట్రోల్ సంబంధించి శిక్షణను కూడా పూర్తి చేసుకున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ ట్రాఫిక్ టీ శ్రీనివాస్ రావు, డీసీపీ బాలానగర్ సందీప్,  డీసీపీ శంషాబాద్ జగదీశ్వర్ రెడ్డి,  సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్, ఆర్ఐ సిద్ధార్థ నాయక్, ఆర్ఐ వెంకట స్వామి, ఆర్‌ఐ అరుణ్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం

Satyam NEWS

చక చకా పని చేస్తున్న మల్లికార్జున ఖర్గే

Satyam NEWS

కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

Satyam NEWS

Leave a Comment