పెద్ద నోట్ల రద్దు అనే ఉగ్రవాద దాడి జరిగి నేటికి మూడు సంవత్సరాలు పూర్తి అయిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసిన దారుణమైన ఈ రోజును ఎవరూ మరచిపోలేదని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. లక్షలాది మంది చిన్న వ్యాపారులు తమ జీవనోపాధికి దూరం అయిన ఈ రోజు చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. లక్షలాది మంది భారతీయులను నిరుద్యోగులుగా మార్చిన రోజు ఇదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము దాచుకున్న డబ్బులు తీసుకోవడానికి రోజుల తరబడి క్యూ లైన్ లలో నిలబడి తో మంది ఈ ఉగ్రవాద చర్య కారణంగా మరణించారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రవాద చర్య వెనుక ఉన్నవారు చట్ట ప్రకారం ఇంకా శిక్ష అనుభవించలేదని ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
previous post