ఆల్కహాలు లేని సహజసిద్ధమైన ఆరోగ్యద్రావకం అయిన నీరాను తాగడం ప్రోత్సహించేందుకు గౌడ ఐక్య సాధన సమితి నేడు హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద ఉచితంగా పంపిణీ చేసింది. తాటి, ఈత చెట్ల నుంచి తీసే నీరాలో ఎన్నో రకాల ఔషధగుణాలు ఉన్నాయి. నీరా ఎన్నో వ్యాధులను నివారించే ఆరోగ్యప్రదాయిని. నీరా సహజసిద్ధమైన హెల్త్ డ్రింక్. శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్‌గానే కాకుండా జీర్ణకోశ సంబంధితమైన ఒక ఔషధంలా కూడా పనిచేస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలను నీరా దూరం చేస్తుంది. కంటిచూపును చాలా వరకు మెరుగుపరుస్తుంది. నీరాలో ఉండే ప్రో బయాటిక్స్ ఇమ్యూనిటీని రోగనిరోధక శక్తి పెరుగడానికి దోహదం చేస్తాయి. నీరాలో ఉన్న అనేకమైన మినరల్స్ వల్ల రక్తకణాలు వేరుపడతాయి. ఇందులో ప్రధానంగా సుక్రోస్ ఉండడం వల్ల డయాబెటీస్ బాధితులు కూడా నిర్భయంగా సేవించవచ్చు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నీరా ఉచిత పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగిందని గౌడ ఐక్య సాధన సమితి నాయకుడు అంబల నారాయణ గౌడ్ తెలిపారు.
previous post