వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్ మండలంలో గల నందివాగు చెరువులో శనివారం తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేప విత్తనాల్నివదిలారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మాట్లాడుతూ… ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధితో పాటు తెలంగాణకు ఆదాయం సమకూరుతుందన్నారు.
మత్స్యసంపద మత్య్సకారులకు ఆర్థిక సంపదతో పాటు తెలంగాణ ప్రజలకు ఆరోగ్య సంపదనిస్తుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.
కార్యక్రమంలో TSEWIDC ఛైర్మెన్ నాగేందర్ గౌడ్, జడ్పీవైస్ చైర్మన్ విజయ్ కుమార్, మోమిన్ పేట్ మండల పరిషత్ అద్యక్షురాలు శ్రీమతి వసంత, PACS చెర్మెన్లు అంజి రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, TRS పార్టీ మండల అధ్యక్షులు నరసింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.