39.2 C
Hyderabad
April 28, 2024 11: 55 AM
Slider మహబూబ్ నగర్

డేంజర్ బెల్ట్: చ‌క్ర‌బంధంలో నాగర్ కర్నూలు జిల్లా

E Sreedhar 251

నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 2 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయినప్పటికీ, పూర్తిస్థాయిలో కరోనా ను కట్టడి చేసి జిల్లా ను సేఫ్ జోన్ లో ఉంచిన జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఇ. శ్రీధర్ అభినందించారు. పక్క రాష్ట్రాలు, పక్క జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ సరిహద్దులు కట్టడి చేసే విషయాలపై ఆయన జిల్లా ఎస్ పి డాక్టర్ సాయి శేఖర్ తో కలిసి సమీక్షించారు.

సేఫ్‌గా ఉన్న‌ నాగర్ కర్నూల్ జిల్లా కు క‌రోనా ను జిల్లా ప్రజలకు దరిచేరకుండా చ‌క్ర‌బంధం ద్వారా పటిష్ట చర్యలు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లాకు తూర్పున  శ్రీశైలం ప్రకాశం గుంటూరు నల్గొండ జిల్లాలు,  ప‌డ‌మ‌ర ఉన్న మహబూబ్ నగర్ – ఉత్త‌రం కు ఉన్న హైదరాబాద్ సూర్యాపేట నల్లగొండ జిల్లాలు -దక్షిణం వైపు ఈశాన్యంలో ఉన్న కర్నూలు గద్వాల జిల్లాల్లో పాజిటివ్ కేసులు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నాయి.

దీంతో నాగర్ కర్నూల్ కు న‌లుదిక్క‌ల నుంచి క‌రోనా వైర‌స్ తొంగి చూసే ప్రమాదముందనీ, ఈ వైర‌స్‌ సంక్ర‌మ‌ణ జ‌రుగ‌కుండా ఉండేందుకు జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా ఎస్పీ రెండు రోజులుగా సరిహద్దులను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోకి ఆయా జిల్లాల నుండి ఎవరూ రాకుండా జిల్లా స‌రిహ‌ద్దుల‌ను మూసివేశారు. శనివారం ఈగలపెంట ఏర్పాటుచేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్, ఎస్పీ వెంట అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా అటవీ శాఖ అధికారి జోజి, అచంపేట్ డిఎస్పి నరసింహులు, సీఐ బిసన్న, ఎస్సై తదితరులు ఉన్నారు.

Related posts

ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు లంచం కావలట

Bhavani

చదువురాని దానవు, నువ్వేం సర్పంచ్ వి పక్కకు జరుగు

Satyam NEWS

మణిపూర్ లో జరుగుతున్న మారణహోమాన్ని ఖండించండి

Satyam NEWS

Leave a Comment