41.2 C
Hyderabad
May 4, 2024 18: 24 PM
Slider వరంగల్

అక్రమంగా లింగనిర్ధారణ చేసి గర్భస్రావాలకు పాల్పడే ముఠా అరెస్టు

#UC Police

కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాల్పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీ లో ఎలాంటి వైద్య విద్య అర్హతలు లేకున్న లింగనిర్ధారణ పరీక్షలు పాల్పడుతూ, అవసరమైన వారికి గర్భస్రావాలకు పాల్పడుతున్న 18 మంది నిందితులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్సు యూసి పోలీసులు అరెస్టు చేసారు.

మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీ లో వున్నారు. వీరి నుండి మూడు లింగనిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్ఫోన్లు, 73వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1, వేముల ప్రవీణ్, 2. వేముల సంధ్యారాణి, 3. డా. బాల్నె పార్ధు, 4. డా. మోరం అరవింద, 5. డా. మోరం శ్రీనివాస్ మూర్తి, 6. డా. బాల్నె

పూర్ణిమ, 7. వార్ని ప్రదీప్ రెడ్డి, 8. కైత రాజు, 9. కల్లా అర్జున్, 10.డి. ప్రణయ్ బాబు, 11. కీర్తి మోహన్, 12. బాల్నె అశలత, 13. కొంగర రేణుక, 14. భూక్యా అనిల్, 15, చెంగెల్లి జగన్, 16 గన్నారపు శ్రీలత 17. బండి నాగరాజు, 18. కాసిరాజు దిలీప్ మరికొద్ది మంది నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.

రంగనాథ్ వివరాలను వెల్లడిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగనిర్ధారణకు పాల్పడుతూ పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకోని అడపిల్ల అయితే గర్భస్రావానికి పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో యాంటీ హ్యూమన్

ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్స్, జిల్లా వైద్య విభాగాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టడం జరిగింది. పోలీసులు ఆపరేషన్ దేశాయ్ నిర్వహించి అక్రమంగా లింగనిర్ధారణ పాల్పడుతున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు.

పోలీసులు అరెస్టు చేసిన విందకుల్లోని ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్ గతలో స్కానింగ్ కేంద్రంలో టెక్నిషన్ గా పనిచేసి అనుభవం వుండటంతో పాటు, గతంలో అక్రంగా లింగనిర్ధారణ పాల్పడటంతో హనుమకొండ పోలీసులు అరెస్టు చేసారు. మరోమారు ప్రధాన నిందితుడు. మేముల ప్రవీణ్ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు.

ఇందుకోసం తన భార్య సంధ్యారాణితో కల్ని కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని గర్భవతులకు లింగనిర్ధారణ చేసేందుకు కొద్ది సిబ్బందితో పోర్టబుల్ స్కానర్ల

సహాయంతో స్కానింగ్ కేంద్రాన్ని రహస్యంగా నిర్వహిస్తున్నారు. నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్.యం.పిలు, పి.ఆర్.ఓలు, హస్పటల్ మెనేజ్ మెంట్, సిబ్బంది మరియు డాక్టర్లతో కల్సి ఒక నెట్వర్క్ గా ఏర్పాటు చేసుకొని తాను రహస్యంగా

నిర్వహించే స్కానింగ్ సెంటర్కు లింగ నిర్ధారణకు వచ్చే మహిళలకు లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి. పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకొని ఆడపిల్ల అయితే గర్భస్రావం కోసం ఈ ముఠాకు చెందిన హస్పటల్స్ హనుకొండలోని లోటస్

హస్పటల్, గాయత్రి హస్పటల్, నెక్కొండలోని ఉపేందర్ ( పార్థు)హాస్పటల్, నర్సంపేట్ లోని బాలాజీ మల్టీ స్పెషాల్టీ హస్పటల్స్ నందు గర్భవతులకు సంబంధిత హస్పటల్లోని డాక్టర్లు, సిబ్బంది అక్రమంగా గర్భస్రావాలను చేసేవారు.

ఇందుకోసం బాధితుల నుండి ఫీజుల రూపంలో వసూళ్ళ చేసిన డబ్బులను ఈ ముఠా సభ్యులు కమీషన్ల రూపంలో వాటాలు పంచుకునేవారు. ఒక్కోక్క గర్భస్రావానికి 20వేల నుండి 30వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసేవారు, ఇప్పటి వరకు ఈ ముఠా వందకు పైగా గర్భస్రావాలకు పాల్పడినట్లుగా గుర్తించడం జరిగింది.

ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డిసిపి పుష్పా, టాస్క్ఫోర్స్ విసిపి జితేందర్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్లు సుజాత, శ్రీనివాస్ రావు, జనార్ధన్ రెడ్డి, వినయ్ కుమార్, ఎస్.ఐలు ఫసీయుద్దీన్, మల్లేశం, శరత్ కుమార్, ఏ.ఏ.ఓ సల్మాన్ప,

ఏ.హెచ్.టి.యు సిబ్బంది ఎ.ఎస్.ఐ భాగ్యలక్ష్మి, హెడా రానిస్టేబుల్ సమీయుద్దీన్, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, సైబర్ క్రైం సిబ్బంది కిషోర్ కుమార్, రాజు, అంజనేయులు, రజియా సుల్తానా, టాస్క్ఫోర్స్ సిబ్బంది. శ్యాంసుందర్, సురేష్, ప్రభాకర్,

కమల వనంత, హోంగార్డ్ రవీందర్, చైల్డ్ కోఆర్టినేటర్లు కృష్ణమూర్తి, కృతిలను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

Related posts

పర్యాటక ప్రాంతాలలో కేబుల్ కార్ ల ఏర్పాటు

Satyam NEWS

ప్రొఫెసర్ కోదండరామ్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి

Satyam NEWS

విద్యార్థులు తినే భోజనంపై రాజకీయాలు చేయడం దుర్మార్గం

Satyam NEWS

Leave a Comment