37.2 C
Hyderabad
May 2, 2024 11: 23 AM
Slider ఆదిలాబాద్

పేదవారికి కూడా రుణాలు అందేలా చేసిన ఇందిరమ్మ

#Congress Party Nirmal

భారత మొదటి మహిళ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయ్యన్నగారి పోశెట్టి మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేదలు సంతోషంగా జీవించారని అన్నారు.

పీసీసీ కార్యవర్గ సభ్యులు ఆనంద్ రావ్ పటేల్ మాట్లాడుతూ రైతులకు రుణాలు కావాలంటే వడ్డీ వ్యాపారస్తులు ను ఆశ్రయించి వారి ఆస్తులను కుదువ పెడితే కానీ రుణాలు వచ్చేవి కాదని అన్నారు.

ఆ సమయములో ఇందిరా గాంధీ బ్యాంకులన్నిటినీ జాతీయం చేసి రైతుకు రుణాలు అనేటట్టుగా చేశారని తెలిపారు.

ఇదే కాకుండా రోటీ కపడా అవుర్ మకాన్ అనే నినాదంతో ప్రతి పేదవాడికి కూడు గుడ్డ ఇల్లు లభించాలని సదుద్దేశంతో పథకాలు రూపొందించారని తెలిపారు.

పేదవారికి ఉపాధి కల్పించాలని నిర్ణయించుకొని గొర్రెలు బర్రెలు పేదవాడికి సమకూర్చారని అన్నారు.

ఇప్పుడేమో టీఆర్ఎస్ ప్రభుత్వం  డబుల్ బెడ్ రూమ్ పేరు చెప్పి వారి నాయకులు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు.

డీసీసీ ఉపాధ్యక్షులు ఎండి అజర్, బైంస కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, టౌన్ ఉపాధ్యక్షులు షాహీన్ హష్మీ, మున్సిపల్ కౌన్సిలర్లు ఇమ్రాన్ ఉల్కా, పురస్థు చిన్నయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

సుకన్య సమృద్ధి యోజన పాస్ బుక్కుల పంపిణీ

Bhavani

నిమ్స్ లో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ వాసులను పరామర్శించిన జూపల్లి

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

Satyam NEWS

Leave a Comment