24.7 C
Hyderabad
May 17, 2024 00: 34 AM
Slider ముఖ్యంశాలు

ప్లవ నామ ఉగాది కవితలకు ఆహ్వానం

#K.Harinath

హైదరాబాద్ పాతనగర కవుల వేదిక లాల్ దర్వాజ ఆధ్వర్యంలో ప్లవ నామ ఉగాది వసంతమాసం సందర్భంగా వర్థమాన కవులు,కవయిత్రుల నుండి కవితలను ఆహ్వానిస్తున్నామని కన్వీనర్ కె.హరనాథ్ (సెల్ నెం. 9703542598) తెలిపారు.

‘‘ఈ కవిత నా స్వంతమే, ఎక్కడ ప్రచురణ కానీ ,ప్రసారం కానీ, ఆన్లైన్ లో కానీ ప్రచురణ కాలేదని  హామీనిస్తున్నాను’’ అంటూ హామీ పత్రం కూడా జత చేయాలని ఆయన కోరారు.

ఏప్రిల్ 10వ తేదీ లోగా కవితలను పంపాలని ఆయన కోరారు. కవితలను 9703542598 కు గానీ, 9182178653 కి గానీ వాట్సాప్ లో పంపాల్సి ఉంటుంది.

కవితలు 25 లైన్లకు మించకుండా వుండాలి. ఎన్నికైన కవితల్లో ఉత్తమ ప్రథమ కవితకి 3,116/- లు ద్వితీయ కవితకి 2,116/- తృతీయ కవితకి 1,116/- ప్రదానం చేస్తారు.

ఇవే కాకుండా మరో పది కవితలకు కన్సోలేషన్ బహుమతులు ఇవ్వదలిచామని కన్వీనర్ కె.హరనాథ్ తెలిపారు.

ఎంపిక చేసిన కవితలను www.satyamnews.net లో రచయితల ఫొటోతో సహా పోస్టు చేస్తామని ఆయన తెలిపారు.

ఉగాది కవితలను సంకలనం వేయదలిస్తే బహుమతుల ప్రదానం చేసేటప్పుడు ఆ విషయాన్ని తెలియచేస్తామని ఆయన అన్నారు.

Related posts

వి.ఎస్.యూ లో డిగ్రీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

Satyam NEWS

రాజ్యాంగం పై అందరికి అవగాహన ఉండాలి

Satyam NEWS

టీడీపీ అభ్యర్ధిపై చెయ్యిచేసుకున్న వైసీపీ నాయకుడు

Satyam NEWS

Leave a Comment