29.7 C
Hyderabad
April 29, 2024 10: 05 AM
Slider కడప

టీడీపీ అభ్యర్ధిపై చెయ్యిచేసుకున్న వైసీపీ నాయకుడు

pullamapeta

కడప జిల్లాలో పలు చోట్ల టీడీపీ అభ్యర్ధులను వైసిపి నాయకులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. కడప జిల్లా పుల్లంపేట మండలంలోని అప్పారాజుపేటలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నాశం వెంకటరెడ్డి (74) నామినేషన్ దాఖలు చేస్తుండగా అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి మామ వైసీపీ మాజీ ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి చేయి చేసుకున్నారు.  

పుల్లంపేట ఎంపిడివో కార్యాలయంలో బుధవారం నామినేషన్ దాఖలు చేయడానికి వెంకటరెడ్డి రాగా ఆయనను అడ్డుకున్న ముద్దా బాబుల్ రెడ్డి బయటకు తోసారు. కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో వైసీపీ వర్గీయులు ఉండడంతో వారిని అడ్డుకునే వారుకుడా లేరు. కాగా మొత్తం 11 ఎంపిటిసిలకు గాను ఎనిమిది ఎంపీటీసీ లు వైసీపీ కి ఏకగ్రీవంగా కాగా, మూడింటికి ఒక్కటీ టీడీపీ, ఒక్కటి బీజేపీ, ఒక్కటి ఇండిపెండేట్ నామినేషన్ దాఖలు చేశారు.

Related posts

పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారoభo

Bhavani

ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

Satyam NEWS

Leave a Comment