Slider ఆదిలాబాద్

నిర్మల్ బిజెపి అధ్యక్షురాలికి పాకిస్థాన్ నుండి బెదిరింపులు

#BJPNirmal

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఏడవ తారీఖు రోజున జరిగిన హింసాకాండలో నష్టపోయిన హిందువులకు అండగా ఉన్నవారికి పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి.

నిర్మల్ జిల్లా బిజెపి, హిందూ క్షేమం కోరుకునే సంస్థల వారికి కొంతమంది విద్రోహులు పాకిస్తాన్ నుంచి  బెదిరింపు కాల్ వచ్చింది.

ఈ విషయాన్ని నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షురాలు పడకండి రమాదేవి పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు.

పాకిస్తాన్ నుండి బెదిరింపు కాల్ వస్తుంటే రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం, పోలీస్ శాఖ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉన్నాయని ఆమె అన్నారు.

భైంసా పట్టణం లో పర్యటించిన వారిపైనే కేసులు పెడతామని, ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ బెదిరించడం శోచనీయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా పోలీసులు మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వం, ఎంఐఎం గుండాలు చెప్పినట్టు వింటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె అన్నారు.

ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తున్నారని మరో వర్గపు వారిని కేసులతో భయపెడుతూ ఆ ప్రాంతంలో లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు.

ఇదే కాకుండా నాలుగు రోజుల క్రితం హిందు వాహిని అధ్యక్షుడు, బిజెపి పట్టణ అధ్యక్షుడు, మరికొంత మందిని పోలీసులు తీసుకొని వెళ్లి ఎఫ్ఐఆర్ చేయకుండానే గత నాలుగు రోజుల నుండి చిత్రహింసలు చేస్తున్నారని ఆమె తెలిపారు.

పోలీసులు ప్రభుత్వం సహకరించకపోయినా  భైంసా లో ఎంఐఎం గుండాలను ఎదుర్కొంటామని అన్నారు. అతి త్వరలో నిర్మల్ ప్రాంతంలో కూడా హింసాకాండ చెలరేగే అవకాశాలు ఉన్నట్టు గా ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాయకుండా ప్రజలందరినీ సమానంగా చూడాలని అందరికీ రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Related posts

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

మీడియేటర్:సమస్యల పరిష్కరానికి ఐజీఎన్‌ కృషి

Satyam NEWS

New year special: తాగి వాహనాలు నడిపితే తాటతీస్తాం

Satyam NEWS

Leave a Comment