25.2 C
Hyderabad
May 16, 2024 22: 09 PM
Slider జాతీయం

RDS కూడి కాల్వ తవ్వకాన్ని వెంటనే నిలుపుదల చేయాలి

#RDS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న RDS కూడి కాల్వను వెంటనే నిలుపుదల చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నేడు అఖిలపక్షం తుంగభద్ర బోర్డు కార్యదర్శికి వినతి పత్రం సమర్పించింది.

గత కొన్ని  రోజులుగా తుంగభద్ర లో కర్ణాటక, తెలంగాణ, నీటివాటా కోసం రైతులు ఆందోళన పడుతున్న విషయం తెలిసిందే. RDS లో ఈ రెండు ప్రాంతాలకు చెందాల్సిన నీటి కోసం కూడా పోరాటాలు జరుగుతున్నాయి. అక్రమ రంద్రాలను పూడ్చటం, ఆనకట్ట ఎత్తపెంచడం ద్వారా, కాల్వలను పూర్తి స్థాయి అధునీకరించి 15.9 TMC ల రావాలని అనేక పోరాటాలు జరుగుతున్నాయి.

అయిన రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయ  లోపం కావచ్చు, నిర్లక్ష్యం వల్ల కావచ్చు తెలంగాణ ప్రజలు, రైతులు పూర్తిగా నష్ట పోయారు. ఇకనైనా RDS నుంచి తమకు దక్కవలసిన వాటాను అందించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది.

ఈ సమస్యలు వుండగానే ఈ మధ్య AP ప్రభుత్వం RDS కుడి వైపున కుడి కాల్వ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీటి అందించే పథకాన్ని రూపొందించి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీనితో RDS పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా, అన్యాయంగా తొవ్వుతున్న ఈ కాల్వను వెంటనే ఆపి వేయాలని అఖిలపక్షం కోరింది.

Related posts

శ్రీశైలం రిజర్వాయర్ కు పెరుగుతున్న వరద నీరు

Satyam NEWS

సింహవాహినీ మాతా పాహిమాం

Satyam NEWS

త్రిబుల్ తలాక్ కేసుల నమోదుపై స్టే ఇవ్వలేం

Satyam NEWS

Leave a Comment