37.2 C
Hyderabad
May 2, 2024 14: 48 PM
Slider జాతీయం

త్రిబుల్ తలాక్ కేసుల నమోదుపై స్టే ఇవ్వలేం

#Delhi High Court

త్రిబుల్ తలాక్ చట్టంలోని సెక్షన్ 4పై కోర్టులో తుది తీర్పు పెండింగ్ లో ఉన్నందున క్రిమినల్ ప్రొసీజర్ పై స్టే విధించాలని దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.

ముస్లిం ఉమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) చట్టం 2019 తీసుకువచ్చిందే ముస్లిం మహిళల హక్కులను కాపాడడం కోసమని కోర్టు వ్యాఖ్యానించింది.

తలాక్ చెప్పిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తున్న సెక్షన్ 4పై కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నందున అప్పటి వరకూ తలాక్ కేసుల్లో నమోదైన ఎఫ్ ఐ ఆర్ లను పెండింగ్ లో ఉంచాలని పిటిషనర్ కోరారు.

ఈ పిటిషన్ ను తిరస్కరిస్తూ తలాక్ చట్టం తీసుకువచ్చిందే ఇలాంటి చర్యలను అరికట్టడానికి, అందువల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని చెప్పేందుకు వీలులేదని జస్టిస్ విపిన్ సంఘి, రాజనీష్ భట్నాగర్ లతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.  

Related posts

Official Home Remedy Remedies For High Blood Pressure Medication To Immediately Lower Blood Pressure

Bhavani

వనదేవతల్ని అవమానించిన చిన జీయర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Satyam NEWS

తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం కరోనా వైరస్ కన్నా ప్రమాదం

Satyam NEWS

Leave a Comment