33.2 C
Hyderabad
May 15, 2024 21: 23 PM
Slider కవి ప్రపంచం

సింహవాహినీ మాతా పాహిమాం

#Jwalitha Balajeenagar

శాకంబరీ జగన్నాయికా

జననీ జగదాంబికా

ఆషాఢమాస ఆరాధనా నవనాయికా

కాదంబరీ సకల కళల కలయికా

కష్టకాల క్షేత్రపాలిక కాళికా

నిత్యవేధనల నీభక్తురాళ్ళ విజయహాలిక

అహంకార జమదగ్నుల భరించే రేణుకా

ద్రోహ మానవ సంహార చండికా

నిత్యాగ్ని పూజిత చండాలికా

ఓంకార నాద శక్తిపీఠ శక్తికా

సకలప్రాణి కోటి రక్షిత కాపాలికా

శత్రు సైన్య కపాలమాలికా

మాతా సింహవాహికా పాహిమాం

రౌద్ర రూప రుధిర దీర్ఘనాలికా

సమన్యాయ రుద్రస్వాభావికా

సమకాల దుష్ట సంహారికా

అమ్మా జననీ సమస్త శత్రు నిర్మూలికా

దయార్ద్ర హృదయ మాలికా సత్యలోక పాలికా

నిరంతర భక్తరక్షికా పాహిమాం

స్వర్ణ బోనభోగికా పాహిమాం

సర్వ పాప నివారికా పాహిమాం

జ్వలిత, హైదరాబాద్

Related posts

రాయలసీమకు శాపంగా అప్పర్ బద్ర ప్రాజెక్ట్

Bhavani

రేపు బడిగంట: పది నెలల తర్వాత తెరుచుకోనున్న పాఠశాలలు

Satyam NEWS

కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి

Satyam NEWS

Leave a Comment