30.2 C
Hyderabad
May 17, 2024 15: 34 PM
Slider అనంతపురం

రాయలసీమలో  మారుతున్న రాజకీయాలు

#jaganmohan

జగన్ రెడ్డి వైనాట్ 175 లక్ష్యానికి అనంత ప్రజల తూట్లు

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు కూడా శరవేగంగా  మారుతున్నాయి. సాధారణంగానే ఎన్నికల సమయంలో జరిగే పార్టీ మార్పులు, అసంతృప్తులు అక్కడక్కడా మొదలయ్యాయి కూడా. ఈ సారి జరిగే ఎన్నికల్లో హోరాహోరీ తప్పదన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీతో పాటు విపక్ష పార్టీల్లో ఉన్న నేతలు కూడా సేఫ్ ప్లేస్ కోసం వేట సాగిస్తున్నారు. ఉన్న చోట గెలిచే అవకాశం ఉంటే సరి లేకపోతే పార్టీ ఫిరాయింపులకు రెడీ అవుతున్నారు. జగన్ రెడ్డి వైనాట్ 175 లక్ష్యానికి అనంత ప్రజల తూట్లు పెట్టనున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో  ఏక పక్షంగా ఓట్లేసి వైసీపీకి అధికారం కట్టబెట్టిన రాయలసీమ జిల్లాల్లో ఈ సారి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కడప జిల్లాలో పలు నియోజక వర్గాల నుంచి అధికార వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతుండగా తాజాగా అనంతపురం జిల్లా నుంచి కూడా వైసీపీ నుంచి టీడీపీ లోకి వలసలు మొదలు కానున్నాయి. ఈ నేపధ్యంలో హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన ఎమ్మెల్సీ ఇక్బాల్ టీడీపీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

తాజాగా వైసీపీ అధిష్టానం హిందూపురం ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి మరో మహిళా నేతకు కట్టబెట్టింది. దీంతో ఆయన అక్కడి నుంచి అసంతృప్తిగా హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సత్యసాయి జిల్లా టీడీపీ నేతలతో ఇప్పటికే మాట్లాడిన ఆయన.. త్వరలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యతోనూ హైదరాబాద్ లో భేటీ అవుతారనే చర్చ సాగుతోంది. హిందుపురం ఎంపీ సీటు నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ రంగం సిద్దం చేసుకుంటున్నారనేది ఈ ప్రచారం సారాంశం.

గతంలో నిజాముద్దీన్ వంటి మైనార్టీ అభ్యర్ధి హిందూపురం ఎంపీగా గెలిచిన చరిత్ర ఉండటంతో తాను కూడా టీడీపీ నుంచి అక్కడ పోటీ చేస్తే ఎంపీగా గెలవచ్చని ఇక్బాల్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఇదిలావుండగా గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాల్లో 14 అసెంబ్లీ స్థానాలు వుండగా హిందూపూర్ నుంచి బాలకృష్ణ, వురవకొండ నుంచి  పయ్యావుల కేశవ్ మినహా మిగిలిన 12 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది.

అలాగే అనంతపురం, హిందూపూర్ లోక్ సభ స్థానాలు కూడా అధికార వైసీపీ హస్తగతం అయ్యాయి. అయితే రానున్న ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీలో అసమ్మతి,  అసంతృప్తి పెరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే లపై స్వపక్షం నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ ముఠాకుమ్ములాటలు రోజురోజుకూ బయటపడుతున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నుంచే అవినీతిపై ఆరోపణలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి అతిపెద్ద అవినీతిపరుడు అని రొళ్ల మండల ఎంపీపీ కవిత ఆరోపించారు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, నాడు నేడు పనుల్లో సిమెంటును పెద్దఎత్తున పక్కదారి పట్టించి స్వాహా చేస్తున్నారనేది ఆమె ఆరోపణలు చేశారు.

అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పై సొంత పార్టీ నేతలే తిరుగు బాటు బావుటా ఎగుర వేశారు. ఆమెపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అదేకోవలో మంత్రివర్గ పున్వ్యవస్థీకరణలో పడవీచ్యుతుడయిన పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై అధికార పార్టీ నేతలే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇదే పరిస్థితులు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నెలకొని వున్నాయి.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెడ్డారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భారీ ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డట్లు వీడియోలు విడుదల చేశారు. తాజాగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి బ్యాంకులకు రూ.900 కోట్లకు పైగా టోపీ పెట్టగా.. ఆయన ఆస్తులు జప్తు చేస్తామంటూ బ్యాంకులు నోటీసులు ఇవ్వడం జరిగింది. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపద్యంలో కదిరి ఎమ్మెల్యే శిద్దారెడ్డి ఈ సారి తిరిగి పోటీ చేసేందుకు ఉత్సహం చూపనట్లు తెలుస్తోంది.

ఇదిలా వుండగా జిల్లాలో వున్న ఇద్దరు ఎంపీలు గోరంట్ల రంగయ్య, తలారి రంగయ్య పై సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారిద్దరికీ తిరిగి సీట్లు ఇచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. దీనికి తోడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాద యాత్ర అనంతపురం జిల్లాల్లో సూపర్ సక్సెస్ అయింది. లోకేష్ పాద యాత్ర చేసిన అన్ని నియోజక వర్గాల్లో ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.

అక్కడి ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను, వైసీపీ నేతల భూ దందాలు, నేర చరిత్రను సాక్ష్యాధారాలతో ఎండ గట్టారు. దీంతో అధికార వైసీపీ నేతల్లో వణుకు ప్రారంభం అయింది. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని 2 ఎంపీ స్థానాలతో పాటు 10కి పైగా ఎమ్మెల్యే సీట్లను టీడీపి కైవసం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి పోటీచేసేందుకు పోటీ పడుతున్నారు. దీంతో అధికార వైసీపీ నాయకులు కొందరు టీడీపీ వైపు చూస్తున్నారు. వైనాట్ 175 అని నొక్కి వొక్కాణిస్తున్న సీఎం జగన్ రెడ్డి లక్ష్యానికి అనంతపురం జిల్లా ప్రజలు బొక్క పెట్టనున్నారు.

Related posts

ఎడతెరిపి లేని వానలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసి నది

Satyam NEWS

జగన్ పనితీరుతో వైసీపీ ఎమ్మెల్యేలకు తంటా

Satyam NEWS

పేకాట డెన్ లో దొరికిన కొల్లాపూర్ మాజీ, తాజా నేతల అనుచరులు

Satyam NEWS

Leave a Comment