31.2 C
Hyderabad
May 12, 2024 02: 16 AM
Slider ప్రత్యేకం

ఎడతెరిపి లేని వానలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసి నది

#musi river

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసి నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. హైదరాబాద్  లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి  వద్ద నదిపై  నిర్మించిన  మూసి ప్రాజెక్టు కు 6 వేల క్యూసెక్కుల నీరు  ఇన్ ఫ్లో వస్తున్నది.

దీనితో ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టనికి చేరుకున్నది. ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి    3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తి విడుదల చేసారు…645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టనికి ప్రస్తుతం 642.5 అడుగుల నీటి మట్టనికి ప్రాజెక్టు చేరుకున్నది.

ఇక క్రస్ట్ గేట్లు ఎత్తడంతో దిగువున ఉన్న   లోతట్టు ప్రాంతాలను, నది సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు సమాచారం అందించారు.

Related posts

మిషన్ మోడ్ లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పన

Bhavani

ట్రెజరీ ఆఫీసు ముందు మొక్కలు నాటిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

Satyam NEWS

ముసాపేట్ లో మళ్ళీ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Satyam NEWS

Leave a Comment