24.7 C
Hyderabad
May 17, 2024 03: 08 AM
Slider క్రీడలు

టైక్వాండో శిక్షణా తరగతులను ప్రారంభించిన ములుగు సీఐ

#muluguci

ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ ప్రక్కన నూతన భవనంలో టైక్వాండో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గత ఐదు సంవత్సరాలకు పైగా ఎస్ఎంఎ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ తనుగుల అనిల్ యాదవ్ పర్యవేక్షణలో టైక్వాండో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. నూతన భవనంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సిఐ రంజిత్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సి ఐ మాట్లాడుతూ టైక్వాండో నేర్చుకోవడం ద్వారా పిల్లలలో శారీరక, మానసిక ఆరోగ్యం దృఢంగా తయారవుతుందని చిన్నతనంలో పిల్లలకు ఇటువంటి శిక్షణ తల్లిదండ్రులందరూ తప్పక నేర్పించాలని సూచించారు. 40 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం అభినందించదగ్గ విషయం అని మాస్టర్ ని శిక్షణ తీసుకుంటున్న పిల్లలను అభినందించారు.

టైక్వాండో మాస్టర్ అనిల్ యాదవ్ మాట్లాడుతూ టైక్వాండో శిక్షణ పోటీలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం వల్ల ఉన్నత చదువులు ఉద్యోగాలలో సర్టిఫికెట్ ద్వారా రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్ఎంఎ టైక్వాండో అసోసియేషన్ ద్వారా టైక్వాండో శిక్షణ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుందని ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ములుగు జిల్లా కేంద్రంలో ఇంతటి మంచి అవకాశాన్ని పాఠశాల విద్యార్థులు కళాశాల విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని తద్వారా ఆత్మ రక్షణలో ఉద్యోగాలలో ఆరోగ్యపరంగా అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలో ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ రెడ్డి, జర్నలిస్ట్ సిహెచ్.రాజువర్ధన్ పోస్టాఫీస్ సమ్మయ్య, తైక్వాండో మాస్టర్ వంశీ,జన్ను విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంటలు రేపుతున్న బూతు మాటలు

Satyam NEWS

జ్యుడిషియల్ అధికారుల నివాస స్థల పరిశీలన

Bhavani

జగన్… దమ్ముంటే ప్రధాని మోడీని విమర్శించు: సోము వీర్రాజు

Satyam NEWS

Leave a Comment