27 C
Hyderabad
May 10, 2024 04: 46 AM
Slider కృష్ణ

సేవకు అంకితమైన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

#taslima

హీరో అనగానే సినిమాల్లో ఉండే కథా నాయకుడు, కథా నాయకీ గానే తప్పా ఇంకోలా గుర్తించలేనంతగా మన అభిప్రాయలు స్థిరపడిపోయాయి. చివరికి ‘మా నాన్నే నా హీరో’ అనీ సినిమాలు చెబితేనే నాన్ననూ హీరోగా గుర్తించలేనంతగా అందులో పడిపోయాం. సుబ్బు ఆర్వీ గారు రాసిన ఈ ‘మన హీరోలు’ సినిమా హీరోల గురించి కాదు. వారి విచిత్ర విన్యాసాల గురించీ కాదు. మన చుట్టు రోజూ తిరగాడే మనుషుల గురించి. వారు చేసిన పనుల గురించి. మన పక్కనే ఉండే మనుషుల్నే పట్టించుకోని కాలాన, హీరోలు మనుషులు వేరువేరు అని నమ్ముతున్న చోట మనుషుల్లో హీరోలను చిత్రిక పట్టిన పుస్తకమిది.

ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్,మరియు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొందరు ప్రముఖుల గురించి రచయిత సబ్బుఆర్వీ రచించిన మన హీరోలు పుస్తకావిష్కరణ నేడు విజయవాడలో జరిగింది. మన హీరోలు శివంగి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్.

“మాట్లాడటం, ఆచరించడం, జీవించడం.. ఓకేలాగా సాగడమే సరైన వ్యక్తిత్వం.”

శ్రమైక జీవనరాగమే సంతోషాల నెలవు. పంచుకుతిన్న పచ్చడి మెతుకలే పరమాన్నం. ఆ పరమాన్నపు రుచి స్వేదాన్ని ఆస్వాదించే శ్రామికునికే తెలుస్తుంది. నీ తోటి వారి ఆకలి, బాధ ఎప్పుడైతే నువ్వు అర్ధం చేసుకోగలవో అప్పుడు మాత్రమే నీకు నిజమైన ఆకలి విలువ తెలిసినట్లు. డబ్బు వస్తే సాయం చేస్తాం, ఉద్యోగం వస్తే ఊడబొడుస్తాం, అధికారం వస్తే పేదరికం లేకుండా చేస్తాం అనే మాటలు కేవలం మాటలే. ఆచరణలో నిలిచే వారు చేతి వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు. ఎందుకంటే అధికారులు, పాలకులు వారు ఇలా కష్టపడి వచ్చాము అని చెప్పడం విన్నాం కానీ అలాంటి కష్టపడే వారికి చేయి ఇచ్చిన వారు అరుదు. మాటలు వేరు ఆచరణ వేరు వారి నిజ జీవిత రూపాలు ఇంకా వేరుగా ఉంటాయి. ఓ వ్యక్తి వ్యవస్థతో నాకు సంబంధం లేదంటూ ఉద్యోగం అంటే జీతం కోసం చేసేది మాత్రమే కాదు, ఎందరి జీవితాల్లోనో తెచ్చే మార్పు కోసం అంటూ సమాజానికి వారి బాధ్యత వారు చేసి చూపిస్తున్నారు. వారే తెలంగాణ ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

కన్న ఊరు, కన్నతల్లి వేరు వేరు కాదంటూ అనేక సామాజిక కార్యక్రమాలతో ఒక ప్రభుత్వాధికారి మనసుపెట్టి వారి బాధ్యత వారు నిర్వహిస్తే వచ్చే మార్పులను స్పష్టంగా చూయిస్తున్నారు. వ్యవసాయంతో ముడిపడిన కుటుంబం నుండి మొదలైంది తస్లీమా బాల్యం. బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించి అమరుడైన కామ్రేడ్ సర్వార్ కూతురు. ఊహ తెలియని వయసులోనే తండ్రి దూరమయినా తన తండ్రి  చేసిన గొప్ప పనులు, పోరాటాలు నిరంతరం చుట్టూ వున్న వారి మాటల్లో వింటూనే వున్నారు. తండ్రి ఆచరించిన సిద్దాంతానికి తెలియకుండానే మరలిపోయారు. నిత్యం శ్రమిస్తూ పెంచిన తల్లి కష్టం, అమ్మతో కలిసి కలుపు తీసిన వ్యవసాయ లోగిల్లు, ఊరు ఎదుర్కుంటున్న ఇబ్బందులు ఎప్పుడూ ఏదో మార్పు సాధించాలనే పట్టుదల పెంచాయి. ఆ పట్టుదలే కష్టపడి చదివేలాగా చేశాయి, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన ఆమెను గ్రూప్స్ వైపు మరలేలా చేశాయి. ఆమె పట్టుదల కష్టం బాధ కన్నీరు ఈ సమాజానికి కనిపించకుండా బురఖా వేశారు. క్షణం క్షణం ఆశయమే ధ్యేయంగా చదివి, ఈ మార్గంలో ఎదురయిన సమస్యలన్నీ మరింతగా బలపరిచాయి, మొదటి ప్రయత్నంలోనే సత్ఫలితాన్ని ఇచ్చాయి. సబ్ రిజిస్ట్రార్ గా నేడు బాధ్యతలు నిర్వహించేలాగా చేశాయి. అధికారులు కారుల్లో, కార్యాలయాల్లో ఉంటే ప్రజా సమస్యలు తెలియవు. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవాలి. అధికారి అంటే ఆజ్ఞలు జారీ చేసి పెత్తనం చూయించడం కాదు ప్రజలకు మద్దతుగా ఉండటం అనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

పచ్చని ఇంకు సంతకం, పచ్చటి పొలాల్లో నాట్లు వేసింది. వ్యవసాయ క్షేత్రాల్లో ఓనమాలు దిద్దిన సబ్ రిజిస్ట్రార్ వీకెండ్ ఫార్మర్ గా మారి ప్రతీ ఆదివారం పొలాల్లోకి కూలీకి వెళుతుంది. అయ్యో సబ్ రిజిస్ట్రార్ కూలి పని చేయడం ఏంటి అని అనుకోకండి, లేక జీతం డబ్బులు చాలకనా అనే చులకన వంకర ఆలోచనలు దరికి కూడా చేర్చకండి. తమ జిల్లాల లోని పరిస్థితులు, వారికి ఉన్న ఇబ్బందులు , ఊరిలో కుటుంబాలకు ఇబ్బందిగా మారిన మహమ్మారి అలవాట్లు గురించి తెలుసుకుంటారు. ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు వరకు వారితోనే వుంటారు. అటుపై అధికారిగా, మానవతా మూర్తిగా వారు తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

కల్యాణ లక్ష్మీ, కారా (చట్టప్రకారం దత్తత) చట్టం, ఆదివాసీలకు తమకు గల ప్రభుత్వ పథకాలు, చట్టాలను గురించి తెలపడం, ఇలా ఈరోజు జిల్లాలో ఏ సమస్య అయినా మొదట వినిపించే పేరు తస్లీమా.

అధికారిగా తన పదవీ బాధ్యతల్లో తన సొంత ఊరిని దత్తత తీసుకున్నారు. ఒక సాధారణ జీవనానికి సరిపడా జీతం వస్తుంది. అందులో నుండి కొంత డబ్బుని ఉపయోగిస్తే ఎందరికో సాయం చెయ్యవచ్చు. 35 సంవత్సరాల క్రితం పెత్తందార్లు ఆక్తమిస్తున్న భూముల నుండి నాటి కామ్రేడ్ సర్వార్ గారు పేదల భూములు పోకుండా గట్లు ఏర్పాటు చేసి పోరాడారు. నేడు అదే ఊరికి బేసిక్ రిజిస్టర్ వారి కుమార్తె తయారు చేశారు. ఆ గట్లు వీరే ఓపెన్ చేశారు. ఊరికి లేని బస్సు మార్గం వేయించడం, ఊరిలో అందరూ కలిసి పండుగలు చేసుకోవడం, వినాయక చవితి పేరుతో విడిపోయి వీధికో బొమ్మ వెలుస్తుంటే తస్లీమా ఆధ్వర్యంలో “ఒక విలేజ్ – ఒక వినాయకుడు” అని మట్టి గణపతిని పూజించి, ఊరిలోని వారికి స్యయంగా ఆమె మట్టి విగ్రహాలను పంచారు. మేడారం విజిలెన్స్ ఆఫీసర్ గా జంపన్న వాగులో జరిగే ప్రమాదాలకు కారణం అక్రమంగా అక్కడ జరుగుతున్న ఇసుక తవ్వకాలు అని ఆ ఇసుక మాఫియా పై గస్తీ నిర్వహించి ప్రత్యక్షంగా పట్టుకున్నారు. అబ్బాపూర్ గ్రామంలో ఒంటరి మహిళలు ఎక్కువ ఎందుకంటే అక్కడ గుడుంబా మూలంగా తెగిన పుస్తెలే అవన్నీ. స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకుని ఆ ప్రాంతంలో మద్యపాన నిషేధానికి కృషి చేశారు. నీటి కోసం ఇక్కట్లు పడే చోట బోర్లు వేయించడం, విద్యార్థులు పాఠశాలకు వెళ్ళేలాగా చేసి పాఠశాలల కార్యక్రమాలపై నిఘా పెట్టడం వంటివి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి నచ్చచెప్పి సక్రమంగా మార్చడం అలాగే ప్రత్యేకంగా దురలవాట్లకు లోనయి మానసిక స్టైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి వ్యక్తిగత ఎదుగుదలకు సహకరించడం వంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో..

ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మానవత్వం మరువలేదు. తోటి వారికి సాయపడుతూ వారంతరంలో కలిసిన కూలీల కష్టాలు తెలుసుకుని వారికి ఆరోజు చేసిన కూలీడబ్బు రూ.250/- తో పాటు ఇంకొంత చేర్చి అక్కడే సాయం చేస్తారు. రోడ్లు, బస్టాండ్ లలో ఎప్పటి నుండో బిచ్చగాళ్లగా, మతిస్థిమితం లేని వారిగా తిరుగుతున్న వారిని మంచిగా పలకరించి, వారి బాగోగులు కనుక్కుని వారి ఊరు వివరాలు కనుక్కుని స్థానిక పోలీస్ వారి సహాయంతో వారి సొంత గూటికి చేరుస్తారు. ఇలాగ సొంత గూటికి చేరిన వారు పాతిక మంది దాకా వున్నారు. కరోనా సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వారికి సేవలు, ఒక్కోసారి పదిహేను కిలోమీటర్లు కొండల్లో నడవాల్సిన పరిస్థితి, వలస కార్మికులకు రాత్రిళ్ళు భోజనం స్వయంగా వండి పెట్టడం, ప్రైవేట్ వాహనాల్లో తరలించి సాయం చెయ్యడం, సమ్మక్క సారక్క, మేడారం జాతర్లలో  అత్యవసర సహాయాలు, రోడ్డు ప్రమాదాల్లో, లేక మరేదైనా దుర్ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు, పేదరికంతో విద్య, వైద్య అవసరాలతో బాధపడే వారికి నిరంతరం అందుబాటులో నిత్యం సేవ చేస్తూనే ఉంటారు.  తన తండ్రి ఆశయాలతో సాగే తస్లీమా గారిని చూస్తుంటే బులెట్ బండిపై వెళ్తున్న కామ్రేడ్ సర్వార్ గుర్తొస్తారు. తండ్రి ఆశయ సాధకురాలిగా ఊరంతా పిలుస్తుంటే తస్లీమా తల్లిగారు మురుసుకోని రోజు లేదు. నల్గొండలో ఓ అమ్మాయి గోడలపై తస్లీమా చేస్తున్న సామాజిక సేవ గురించి వాల్ ఆర్ట్ వేయించి ఇటువంటి ప్రభుత్వాధికారులు కావాలని సందేశమిచ్చారు. నిజమే ఇటువంటి అధికారులు అన్ని చోట్లా ఉంటే గ్రామాలు ఎంతగా వృద్ధి చెందుతాయో కదా..

ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి తోడ్పాటుగా ఉండటమే ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత. అటువంటి బాధ్యత సంపూర్ణంగా సోదరి తస్లీమా నిర్వహిస్తున్నారు. కష్టంతో పైకి వచ్చాము అని గొప్పలు లేదా సానుభూతి మాటలు ఇంటర్వ్యూ లేదా సమావేశాల్లో చెప్పడం కాదు కష్టంలో నుండి ఎదిగిన వ్యక్తి కష్టాల్లో ఉన్న వారికి చేదోడుగా నిలబడటమే నిజమైన స్ఫూర్తి ఆదర్శం. ఓ ఉద్యోగి ఏమి చేయగలదో ఈ సమాజంలోని అనేక కోణాల్లో నిరూపించిన సబ్ రిజిస్ట్రార్ నేటికి ఆర్టీసీ బస్సు కోసం వేచి చూస్తుంది. కష్టపడితే ఉద్యోగం వస్తుంది కానీ ఉన్నతమైన వ్యక్తిత్వం ఆచరణతోనే సాధ్యం. సెల్యూట్ టు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్.

Related posts

నవంబర్ 26న విహెచ్ పిఎస్ పోరాట దినోత్సవం  

Murali Krishna

ఆనం ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని పట్టుదలతో ఉన్న జగన్ !

Bhavani

‘సాటిలేని సహకారం’ పై చర్చకు సిద్ధం

Bhavani

Leave a Comment