27.7 C
Hyderabad
May 16, 2024 05: 02 AM
Slider వరంగల్

రేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి సతీష్ రెడ్డికి లేదు

#mulugucongress

హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం మేడారం వనదేవతల ఆశీర్వాదంతో ముందుకు సాగలనుకుంటున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని భారాస పార్టీ రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి విమర్శించడం సిగ్గుచేటు అని కిసాన్ కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ అన్నారు. ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, మనకు రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తే ఇంతవరకు గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయించిన ఇప్పటి వరకు అతి గతి లేదని గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్లు ఉంది బిఆర్ ఎస్ బిజెపి పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసి రైతులకు ఉచిత విద్యుత్, లక్ష రూపాయల ఋణమాఫీ, పంట రుణాలు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

ములుగు జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు కట్టి పంట పొలాలకు సాగునీటిని అందించి రైతులను మరియు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, కల్వకుంట్ల కుటుంబానికి పదవులు లేవన్న విషయం మరిచిపోయినట్టు ఉన్నావు సతీష్ రెడ్డి అని ఆయన అన్నారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి వెళ్లి ఫ్లెక్సీలు కట్టుకుని బ్రతికేవాడివి నువ్వు రేవంత్ రెడ్డిని విమర్శిస్తావా… నువ్వు ఎవరో నీ దేవగిరి పట్నం గ్రామస్థులకే తెలియదు నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఉందా తెలుసుకోవాలి అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన దేవాదుల ప్రాజెక్టు ద్వారానే సిద్దిపేట, మెదక్ జిల్లాలకు నీళ్లు అందుతున్నాయని తెలుసుకో అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు పదవుల కోసం, పైసల కోసం పాకులాడే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి అయితే నీలాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి వెళ్ళేవాడని అన్నారు. నిజాన్ని నిర్భయంగా, నిక్కచ్చిగా మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పుతూ, పోరాటమే ధ్యేయంగా వెలమ దొరల అక్రమ పాలనను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఒక వీరుడిలా పోరాడుతూ ఉన్న వ్యక్తి అని అన్నారు.

ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి గురించి అసత్య ప్రచారాలు చేసిన, అవమానకర వ్యాఖ్యలు చేసిన ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి, సహకార సంఘం డైరెక్టర్ అడ్వకేట్ సారంగపాణి తదితరులు ఉన్నారు.

Related posts

ఉప్పొంగుతున్న కృష్ణా, భీమా నదులు

Satyam NEWS

డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించిన ప్రభుత్వ విప్

Satyam NEWS

హైదరాబాద్ నడిబొడ్డున తాగునీటి సమస్య తీవ్రం

Satyam NEWS

Leave a Comment