28.2 C
Hyderabad
May 17, 2024 13: 01 PM
Slider ముఖ్యంశాలు

షర్మిలా రెడ్డి కి గులాబి నేతల రక్షణ కవచం

#SharmilaTRS

తెలంగాణలో విద్యార్ధులకు ఫీజులు అందుతున్నాయా? పేదవారికి వైద్యం అందుతున్నదా? అంటూ తెలంగాణ ను పాలిస్తున్న టీఆర్ఎస్ ను నేరుగా సూటిగా ప్రశ్నించిన షర్మిలారెడ్డి పై టీఆర్ఎస్ విచిత్రంగా స్పందించింది.

సాధారణంగా అయితే టీఆర్ఎస్ పార్టీని, సిఎం కేసీఆర్ ను పల్లెత్తు మాట అంటే టీఆర్ఎస్ అభిమానులు దుమ్మెత్తి పోసేవాళ్లు. అయితే అదేమిటో విచిత్రంగా షర్మిలా రెడ్డిని టీఆర్ఎస్ వెనకేసుకువస్తున్నది.

షర్మిలా రెడ్డి పార్టీ పెడుతున్నట్లు పావులు కదిపిన నేపథ్యంలో ఆమెపై టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు.

మీ అన్న మీకు అన్యాయం చేసుంటే ఆంధ్రకు వెళ్లి నిలదీయాలంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో ఏం పని చెల్లెమ్మా అంటూ మరికొందరు స్పందించారు.

షర్మిల ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేసిన ఫ్లెక్సీలను కూడా వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులకు హైకమాండ్ నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.

షర్మిలకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులను, ఫొటోలను తొలగిస్తున్నారు. షర్మిలపై పోస్టులు పెట్టొద్దు అంటూ పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ కీలక ఆదేశాలు జారీ చేసి అందరిని ఆశ్చర్య పరిచింది.

అందుకే కాబోలు షర్మిలా రెడ్డి కేసీఆర్ వదిలిన బాణం అంటూ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related posts

వివాహిత కుమార్తెకు కూడా కారుణ్య నియామకం అర్హత

Satyam NEWS

ఆర్థికంగా చితికినా అసమాన ప్రతిభ చూపిన వైష్ణవి దేవి

Bhavani

రావమ్మా ..

Satyam NEWS

Leave a Comment