25.2 C
Hyderabad
May 16, 2024 20: 54 PM
Slider కరీంనగర్

కరీంనగర్ ప్రజలకు 24 గంటల నీటి సరఫరా

#ministerkamalakar

ఎక్కడా నీరు నిలువకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన నగరం అందించేలా క్రిమి కీటకాలు వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నేడు ఆయన కరీంనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

కోర్టు సమీపంలో నిర్మేం ఇంజనీర్ వసతి గృహానికి శంఖుస్థాపన చేసిన అనంతరం నగరంలో పలు కాలనీలు సందర్శించి ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఏ నలబై యాబై ఏళ్లలో ప్రభుత్వాలు ఇవ్వనంతగా ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ కు అత్యధిక నిధుల్ని మంజూరు చేస్తున్నారన్నారు. అందువల్ల కొత్త డ్రైనేజీలు, ప్రతీ కాలనీలకు కొత్త రోడ్లు, పాత రోడ్ల ఆధునీకరణ చేపడుతూ ఎక్కడా నీరు నిలువకుండా చూస్తూ అటు పరిశుభ్రంగా సానిటేషన్ తో పాటు ఇటు రోడ్ల నాణ్యత పెరిగే విదంగా చర్యలు చేపడుతున్నామన్నారు. మున్సిపల్ సిబ్బందికి ఏవైనా పిర్యాదులు అందినా వెంటనే చర్యలు తీసుకొనేలా యంత్రాంగం అందుబాటులో ఉంచామన్నారు.

నగర ప్రజలకు నీటి కొరత లేనేలేదని, ప్రజలు కొరినంత, వారికి సరిపోయెంత నీరిస్తున్నామన్నారు. 24 గంటలు నల్లాల్లో నీరు రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఇప్పటికే మూడు ప్రాంతాల్లో మొదలుపెట్టామని అక్కడి అనుభవంతో త్వరలోనే నగరం మొత్తానికి అందజేస్తామన్నారు. నగర జనాబా ఎన్నో రెట్లు పెరిగినా గత ప్రభుత్వాల నిర్వాకంతో కోర్టు రిజర్వాయర్ సామర్థ్యం పెరగలేదన్నారు,

ప్రస్థుతం దీని సామర్థ్యం పెంచే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. అందుకనుగుణంగా ఏఈ ఆపీసును అధునీకరించి, సమావేశమందిరం, ప్రజాప్రతినిధుల ఆఫీసును కూడా 35లక్షల నిధులతో పనుల్ని ప్రారభించామన్నారు. గతంలో పక్కనే మానేరు నది ఉన్నా వారానికోసారి కూడా నీరు రాక గోస పడ్డామని నేడు ముఖ్యమంత్రి పాలక వర్గాలకు నేరుగా నిధులివ్వడం ద్వారా కరీంనగర్లో నిటికొరతే లేకుండా చేసామన్నారు. మొత్తానికి కరీంనగర్ నగరంలో అన్నిరకాలుగా అధ్బుతమైన అభివ్రుద్దిని చేపడుతున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు,  కార్పోరేటర్లు రాపర్తి విజయ, గందె మాదవి, సీనియర్ నాయకులు చల్లా హరిశంకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

24 న సూర్యాపేటకు కేసీఆర్

Bhavani

బోనాల పండుగ

Satyam NEWS

డేటింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక?

Satyam NEWS

Leave a Comment