37.2 C
Hyderabad
May 1, 2024 12: 08 PM
Slider తూర్పుగోదావరి

ఆప్కాఫ్ బంకు ద్వారా మత్స్యకారులకు సబ్సిడీ డీజిల్ అందించాలి

#kondababu

వైసిపి ప్రభుత్వం మత్స్యకారులు ముప్పుతిప్పలు పెడుతూ అన్ని విధాలుగా నమ్మించి మోసం చేసిందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు విమర్శించారు. ఆప్కాఫ్ డీజిల్  బ౦కు ద్వారా మత్స్యకారులకు సబ్సిడీ డీజిల్ అందించాలని కోరుతూ   ఫిషింగ్ హార్బర్ నందు మత్స్యకారులతో కలిసి ఆప్కాఫ్ డీజిల్ బంకు న౦దు నిరసన తెలిపారు. 

ఈ సందర్బంగా కొండబాబు మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ డీజిల్ బంకు ఏర్పాటు చేసి మత్స్యకారులకు సబ్సిడీ ద్వారా డీజిల్ అందించడం జరిగేదని, నేడు ఎమ్మెల్యే ద్వారంపూడి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆప్కాఫ్ డిజిల్ బంకును మూయించి తన అనుచరుల చేత బయోడీజిల్ అధిక రేట్లకు అమిస్తున్నారని అన్నారు.

ప్రైవేట్ బంకుల్లో డీజిల్ రేటు 99 ఉండగా ఆప్కాబ్ బంకులో అధిక రేట్లకు డీజిల్ అమ్మగా మత్స్యకారులు ఆరేట్లకు డీజిల్ కొనలేక ప్రయివేటు బంకుల్లో డీజిల్ కొనుక్కుని వేటకు వెళ్లి  నష్టాల్లో కూరుకుపోగా, ఇంజన్లు చెడిపోతాయని తెలిసినా మత్స్యకారులు బయో డీజిల్ 76 రూపాయలకు కొనుక్కుని వేటకు వెళ్లడం జరిగేదని తెలిపారు.

తన అనుచరుల చేత బయోడీజిల్ బంకులను   సిండికేట్ గా ఏర్పాటు చేసి బయో డీజిల్ ను 85 రూపాయలకు అందిస్తున్నారని, నేడు ప్రయివేటు బంకులలో డీజిల్ రేటు 99.74 ఉంటే ఆప్కాఫ్  ద్వారా సబ్సిడీ 9 రూపాయలు తగ్గించి 90.74 అమ్మాలని కానీ కాకినాడలో ఆ విధానం జరగక మత్స్యకారులు నష్టపోతున్నారని అన్నారు నెల్లూరు, మచిలీపట్నం, ఓడరేవు, తదితర ప్రాంతాల్లో నడుస్తున్న ఆప్కాఫ్ డీజిల్ బంకులు కాకినాడలో ఎందుకు ఆప్కాఫ్  డీజిల్ అందించడం లేదని ప్రశ్నించారు.

మత్స్యశాఖ మంత్రి మరియు మత్స్యశాఖ   అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకు౦డా, బయోడీజిల్ అధిక రేట్లకు అమ్ముకొని లబ్ది పొందుతున్నారని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులకు సబ్సిడీ ద్వారా వలలు, రోపు వైర్లు, ఐస్ బాక్సులు, ఇంజిన్లు అందించడం జరిగేదని, ఈ మూడు సంవత్సరాల వైసిపి పాలనలో మత్స్యకారుడికి ఒక్క వల ముక్కయినా జగన్ రెడ్డి అందించారా అని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో ఓటు ఓనర్లు పంతాడి రాజు, చింతా పేర్రాజు, పోర నాగేశ్వర్రావు, కర్రి శ్రీను, చంటి, ధర్మారావు, రాము, తెలుగుదేశం నాయకులు వనమాడి ఉమాశంకర్, తుమ్మల రమేష్, అంగాడి ధర్మారావు, ఎర్రపిల్లి రాము, చోడిపిల్లి సతీష్, ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు.

Related posts

రిజర్వేషన్లను 77 శాతానికి పెంచాలి

Satyam NEWS

ఇద్దరు పిల్లలను హత్య చేసిన కన్నతండ్రి

Bhavani

ఈ చీకటి జీవో ముఖ్యమంత్రి సభలకు వర్తించదా?

Bhavani

Leave a Comment