25.2 C
Hyderabad
May 16, 2024 23: 08 PM
Slider ముఖ్యంశాలు

క‌రోనా స‌మ‌యంలో శ్ర‌మించి సేవ‌లందించిన వారికి రేంజ్ డీఐజీ చిరు స‌త్కారం…!

#corona

ఏడాదిన్న‌ర నుంచీ రెండు ద‌శ‌ల‌లో క‌రోనా విజృంభించి ఎందరో ప్రాణాల‌ను హ‌రించింది. ఆ స‌మ‌యంలోనే కరోనా సోకిన బాధితుల‌కు ప‌లు స్వచ్చంద సంస్థ‌లు ఎన‌లేని సేవ‌లు అందించాయి. ఆ సేవ‌ల‌కు గుర్తుకుగాను ఆయా సేవా సంస్థ‌ల అధ్య‌క్షుల‌తో పాటు ఉడ‌త సాయం చేసిన వారిని కూడా స‌న్మానించాల‌ని నిర్ణ‌యించింది…విజయనగరం యూత్  ఫౌండేషన్.

ఈ సంద‌ర్భంగా స్థానిన రెవిన్యూ హోంలో విజయనగరం యూత్  ఫౌండేషన్  ఆధ్వర్యంలో జ‌రిగిన కరోనా  సేవా పుర‌స్కార స‌భ‌కు ముఖ్య అతిధిగా విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు,విజ‌య‌న‌గరం జిల్లా  ఎస్పీ  దీపికా ఎం పాటిల్,లోక్ స‌త్తాఅధినేత భీశెట్టి బాబ్జిలు పాల్గొన్నారు.

ఈ మేర‌కు రేంజ్ డీఐజీ రంగారావు మాట్లాడుతూ…విజయనగరం యూత్  ఫౌండేషన్ ఈ రెండు  విడ‌తల క‌ర‌నాస‌మ‌యంలో దాదాపు 300 మంది ప్రాణాల‌ను కాపాడింద‌న్నారు. ప్ర‌తీ ఒక్క‌రి  వ‌ద్ద డ‌బ్బు లేక‌పోవచ్చు …కాని సేవ అనే గుణం ఉంటే  వెయ్యిరెట్టు డ‌బ్బున్న‌ట్టే న‌న్నారు.

ఈ విష‌యంలో ముగ్గ‌రు యువ‌కులు….క‌లిసి పెట్టిన విజయనగరం యూత్  ఫౌండేషన్ అనిత‌ర సాధ్య‌మైన సేవ‌ల‌ను అందించింద‌న్నారు ఆ ముగ్గురిలో డెంకాడ పోలీస్ స్టేష‌న్ లో  కానిస్టేబుల్ గా  ప‌ని చేసి ఇల్త‌మేష్ ఒక‌రు ఉండ‌టం పోలీస్ శాఖ‌కే గర్వ‌కార‌ణ‌మ‌న్నారు.

అంత‌కుముందు  జిల్లా ఎస్పీ దీపికా ఎం.పాటిల్ మాట్లాడుతూ తొలి ద‌శ‌,రెండో ద‌శ కరోనాను చూసామ‌ని..అక్టోబ‌ర్ లో థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని వార్త‌ల‌లో  చూస్తున్నామ‌ని…అదే గ‌నుక వ‌స్తే….గ‌డ‌చిన రెండు ద‌శ‌ల‌లో ప‌ని చేసిన విజయనగరం యూత్  ఫౌండేషన్  అందుకు దీటుగా ప‌ని చేయాల‌న్నారు.

దేవుని ద‌యవ‌ల్ల‌న థ‌ర్డ్ వేవ్ రాకూడ‌ద‌ని కోరుకుంటున్నామ‌న్నారు. రెండు ద‌శ‌ల‌లో  ఎంతో మంది ప్రాణాలు కాపాడిన  విజయనగరం యూత్  ఫౌండేషన్  త‌న సేవ‌ల‌ను ఇలానే నిరంత‌రం కొన‌సాగించాల‌ని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్ర‌మానికి ద‌ళిత సంఘం అధ్య‌క్షుడు చిట్టిబాబు అద్య‌క్ష‌త వ‌హించగా,సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ జ‌య‌రాజ్ కూడా పాల్గొన్నారు.

Related posts

అప్పుడు మాతృభూమి కోసం…ఇప్పుడు యోగం కోసం…

Satyam NEWS

సిర్పూర్ గడ్డపై దోపిడీ పాలన పోవాలి

Satyam NEWS

అధికార భాషా సంఘం అధ్యక్షుడిని కలిసిన రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం

Satyam NEWS

Leave a Comment