29.7 C
Hyderabad
May 2, 2024 05: 27 AM
Slider ఆదిలాబాద్

సిర్పూర్ గడ్డపై దోపిడీ పాలన పోవాలి

#rspraveenkumar

ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చి సిర్పూర్ లో దోపిడీ,దౌర్జన్యాలు చేస్తున్న ఎమ్మెల్యే కొనేరు కోనప్పను వచ్చే ఎన్నికల్లో ఓడించి,తిరిగి ఆంధ్రాకు పంపాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో బీఎస్పీ అధ్వర్యంలో శనివారం రాత్రి ర్యాలీ నిర్వహించారు.ఆంధ్రా నుంచి తెలంగాణకు బ్రతకడానికి వలస వచ్చిన కోనప్ప కుటుంబం ఈ ప్రాంతంలోని వనరులు, సంపాదనను దోచుకొని అక్రమంగా వందల కోట్లు ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.

ఎమ్మెల్యే కోనప్ప దౌర్జన్యాలను ప్రశ్నించే వారిపై పోలీసులతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని విమర్శించారు. జిల్లా ఎస్పీతో సహా అధికారులందరూ ఉత్సాహ విగ్రహాలుగా మిగిలి కోనప్ప చేతిలో బందీ అయ్యారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ చేసే రాజకీయ పోరాటం బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపి పార్టీలతో కాదన్న ఆయన కోనప్ప దౌర్జన్యాలను అడ్డుకోవడం కోసమే  పార్టీలకతీతంగా ప్రజలందరూ ఏకమై బీఎస్పీకి ఓట్లేసి గెలిపించాలన్నారు.

నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో విద్య,వైద్యం అందక రవాణా సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఆదివాసి గూడేలకు రోడ్లు నిర్మించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. పదేళ్లలో ఏం సాధించారని బీఆర్ఎస్ నేతలు ఓట్లడగడానికి నికి గ్రామాలకు వస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడించి, బీఎస్పీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన బెజ్జూర్ ఉపసర్పంచ్ అడ్డూరి రాజేశ్, వార్డు సభ్యులు శంకర్, పోశం,లలిత, దేవాజీ తోపాటు బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు దాదాపు 300 మందికి పైగా బీఎస్పీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్,రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా ఇంఛార్జి సోయం చిన్నయ్య ,జిల్లా మహిళా కన్వీనర్ సిడెం జ్యోతి, అసెంబ్లీ అధ్యక్షులు డోకే రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుటుంబంపైనే కత్తి: భార్య, చెల్లి మృతి

Satyam NEWS

మీడియాపై ఆంక్షలు విధించిన అనంతపురం కలెక్టర్

Satyam NEWS

స్పీకర్ సహకారంతో కోటగిరిలో మినీ స్టేడియం నిర్మిస్తాం

Sub Editor

Leave a Comment