29.7 C
Hyderabad
May 2, 2024 06: 42 AM
Slider హైదరాబాద్

ప్లాస్టిక్‌ కోర్సుల పట్ల విద్యార్ధులు మక్కువ చూపాలి

#mlasubhashreddy

ప్లాస్టిక్‌ కోర్సుల పట్ల విద్యార్ధులు మక్కువ చూపాలని, ర్యాంకులు సాధించే దిశగా రాణించాలని  ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నరు.

కాప్రా సర్కిల్‌  చర్లపల్లి పారిశ్రామిక వాడలోని కేంద్రప్రభుత్వ సెంట్రల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) ప్రతినిధులు వివిద కోర్సులకు సంబందించిన కరపత్రంను ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ సీపెట్‌లో తెలంగాణ విద్యార్ధులు ర్యాంకులు సాధించే దిశగా రాణించాలన్నారు.

సీపెట్‌ సంస్థ ప్రతినిధులు గోవిందు నాయక్‌  మాట్లాడుతూ విద్యార్ధులకు సీట్లు కేటాయించి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా బోజనము,హాస్టల్‌ వసతి,స్కాలర్‌షిప్‌తో పాటు  ఉపాది కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాప్రా డివిజన్‌ కార్పోరేటర్‌ స్వర్ణరాజ్‌శివమణి, టీఆర్‌ఎస్‌ నాయకులు సుడుగు మహేందర్‌రెడ్డి, గరిక సుధాకర్‌, గంగిడి కృష్ణారెడ్డి, ఎం.కే.బద్రుద్దీన్‌, కొండల్‌గౌడ్‌, కొప్పుల కుమార్‌, సీపెట్‌ ప్రతినిధులు తదితరలు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ముందస్తు అరెస్ట్

Satyam NEWS

ఏప్రిల్ 14 నుండి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు భ‌క్తుల‌కు అనుమ‌తి

Satyam NEWS

సీఎం సహాయ నిధి చెక్కు అందచేత

Bhavani

Leave a Comment