25.2 C
Hyderabad
May 16, 2024 21: 33 PM
Slider ఖమ్మం

చట్టాలపై అవగాహన ఉండటమే అందరికి శ్రేయస్కరం

#khammam court

ప్రజాస్వామ్య సమాజంలో ప్రతిఓక్కరికి చట్టలపై అవగాహన వుండాలని రెండవ, మొదటి అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయమూర్తులు పి. మౌనిక, N.శాంతి సోని అన్నారు.  ప్రజలలో చట్టలపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో “లీగల్ లిట్రసీ క్యాంప్” ను ఖమ్మం అర్బన్ మండలంలోని  గొల్లగూడెం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన  న్యాయమూర్తులు  మాట్లాడుతూ…. ప్రజలు

చట్టంలోని ప్రాథమిక స్థాయిని తెలుసుకోవడం ద్వారా వారు అన్యాయాలను మరింత బలంగా గుర్తించి సవాలు చేయవచ్చుని అన్నారు.

అదేవిధంగా క్షణికావేశం, మనస్పర్థలు, సమస్యలతో వివాదాల్లో చిక్కుకుని మనశ్శాంతిని కోల్పోరాదని అన్నారు. రాజీ చేసుకోదగ్గ కేసుల్లో కక్షిదారులు.. ఉభయ వర్గాల రాజీ మేరకు కేసులు పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా రాజీ మార్గం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు. 

ప్రధానంగా  తల్లిదండ్రులను గౌరవించాలని, ఆస్తుల కోసం కన్నవారిని  దూరం చేసుకోకుండా… మానవతా విలువలు కాపాడాలని అన్నారు. తమ పిల్లల కదలికలపై తల్లిదండ్రుల  పర్యవేక్షణ ఉండాలని, తెలిసీ తెలియని వయసులో చేసే చిన్న చిన్న తప్పిదాలు జీవితంలో సరిదిద్దుకోలేని పరిస్థితులు వస్తాయని అన్నారు.  వృద్ధులైన తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాలు పంపిస్తే భవిష్యత్తులో మీరు కూడా అదే పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం వుంటుందని  గ్రహించాలని సూచించారు.  

సెప్టెంబర్ 1 వ తేదీ నుండి 11 వరకు లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం ఖానపురం హావేలి సిఐ వెంకన్న బాబు, ఎస్సై కుమారస్వామి పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ జాగృతి పట్టణ మహిళా కన్వీనర్ గా షేక్ రహీమా

Satyam NEWS

ఉచితంగా మూడు స‌బ్జెక్ల్ ల‌ కు శిక్ష‌ణ‌….!త్రిశూల్ ర‌మ‌ణా స్కూల్ సంచ‌ల‌న నిర్ణ‌యం….!

Satyam NEWS

కేరళలో ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Murali Krishna

Leave a Comment