25.2 C
Hyderabad
May 16, 2024 22: 41 PM
Slider నిజామాబాద్

అంటు వ్యాధులు నిర్మూలిస్తే అందరికి ఆరోగ్యం

#dryday

దోమలు పుట్టకుండా, దోమలు కుట్టకుండా అందరూ చర్యలు తీసుకోవాలని బిచ్కుంద ఎంపిడివో ఆనంద్ పిలుపునిచ్చారు. నేడు బిచ్కుంద మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫ్రై డే అండ్ డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపివో మెహబూబ్,  డివిజన్  ఆరోగ్య బోధకులు దస్తీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ దోమల నిర్మూలనకు తగు నివారణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దోమల వ్యాప్తి కారణంగా మలేరియా, ఫైలేరియా, డెంగీ,చి కెన్ గొనియా లాంటి వ్యాధులు వస్తాయని ఆయన తెలిపారు. వర్షా కాలం కావడం చేత వర్షాలు  పడటం కొత్త నీరు పాత నీరు కలువడం నీటి వల్ల అంటువ్యాధులు ప్రబలుతాయని, డయోరియా, డిసంట్ర (కుట్టు బాయళు), కలరా, జండిస్ లాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఫ్రై డే డ్రై డే కార్యక్రమాన్ని పాటిస్తే దోమలు పుట్టకుండా-దోమలు కుట్టకుండా ఉంటందని తెలిపారు. కొబ్బరి చిప్పలు ,పాత టైర్ల,పాత కూలర్ల, రొళ్లలలో నీటి నిల్వ లేకుండ చూడాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆరోగ్య కార్యకర్తలు,అంగన్వాడీ టీచర్లు ఆశలు,GP కార్యదర్శి,సిబ్బంది పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

3లక్షల పైనే

Bhavani

అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ

Satyam NEWS

అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

Leave a Comment