28.2 C
Hyderabad
May 17, 2024 13: 01 PM
Slider సినిమా

సినీ నటుడు అలీకి త్వరలో మహర్దశ?

#actorali

సినీ హాస్య నటుడు అలీకి మహారాజ యోగం పట్టబోతున్నట్లున్నది. సినీ హీరోలతో కలిసి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో నేడు అలీ కూడా పాల్గొన్నాడు. ఎన్నికల సమయంలో సినీ ఇండస్ట్రీ అంత దూరంగా ఉన్నా కూడా అలీ వైసిపికి మద్దతు తెలిపాడు.

ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించిన అలీ అప్పటి నుంచి పార్టీకి విధేయుడుగా ఉన్నాడు. గత రెండున్నరేళ్ళ గా అలీ పదవి కోసం ఎదురు చూస్తున్నాడు. పాపం… అలీకి ఇప్పుడు కాలం కలిసి వచ్చినట్లుగా అనిపిస్తున్నది. సినిమా హీరోలతో కలిసి వెళ్లిన అలీని మరో వారం లో కలుద్దాం అని ప్రత్యేకంగా సీఎం జగన్ చెప్పారని తెలిసింది.

త్వరలో ఏపిలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటి ఎంపికకు కసరత్తు కూడా ప్రారంభించారు. ఈ సమయంలో వారం రోజుల్లో మళ్లీ కలుద్దాం అని జగన్ అనడంతో అలీకి ఉత్సాహం రెట్టింపు అయింది. రాజ్యసభ సభ్యత్వం ఒక ముస్లింకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ఆ ముస్లిం నేత సినీ నటుడు అలీ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related posts

నిరుపేదలకు నిత్యావసరాలు అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

కోవిడ్ 19 రిలీఫ్ కోసం తోషిబా సిస్టమ్స్ విరాళం

Satyam NEWS

సాహో కటౌట్ ఓకే కంటెంటే డౌటు

Satyam NEWS

Leave a Comment