25.2 C
Hyderabad
May 16, 2024 20: 23 PM
Slider చిత్తూరు

తిరుమల శేషాచలం అడవుల్లో దేవాంగ పిల్లులు

#Rare Cats in Tirumala

తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శేషాచలం అడవుల్లో రెండు అరుదైన పిల్లి జాతి పిల్లలను రోడ్డు నిర్మాణ కార్మికులు గుర్తించారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద వీటిని గుర్తించారు. ఇవి దేవాంగ పిల్లులని అటవీ సిబ్బంది తెలిపారు. ఈ పిల్లులు కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. దేవాంగ పిల్లుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని, అద్భుత శక్తులున్నాయని గిరిజనులు విశ్వసిస్తారు.

భారతీయ అటవీ చట్టం ప్రకారం వీటిని పెంచుకోవడం, అమ్మడం నేరం. అందుకే అక్కడ దొరికిన పిల్లులను అదే అడవిలో వదిలిపెట్టారు. దేవాంగ పిల్లులు 6 నుండి 15 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. చెట్ల చిటారు కొమ్మలపై జీవిస్తూ ఆకుల్ని, పురుగుల్ని తింటాయి. వీటి జీవితకాలం 12 నుండి 15 ఏళ్లు ఉంటుంది.

Related posts

విజేతగా నిలిచిన నలంద డిగ్రీ కాలేజి జట్టు

Bhavani

విజయ్ మాల్యా పాత్రలో అనురాగ్ కశ్యప్

Satyam NEWS

గట్టు మట్టి తరలింపు పై తీగ పట్టుకుంటే డొంక కదిలింది..

Satyam NEWS

Leave a Comment