38.2 C
Hyderabad
April 29, 2024 20: 05 PM
Slider నల్గొండ

మోడల్: నియంత్రిత సాగు విధానం దేశానికే ఆదర్శం

#Gutta Sukhendar Reddy

తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న నియంత్రిత సాగు విధానం రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుందని, దేశానికే తెలంగాణ వ్యవసాయ విధానం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన  రైతులు లాభాలు గడిచే విధంగా  తెలంగాణ ప్రభుత్వం పంటల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.

ప్రతిపక్షాలు  అర్ధం లేకుండా , అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని గుత్తా అన్నారు. వ్యవసాయ o పై కనీస అవగాహన లేని  కొంత మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గుడ్డిగా  నియంత్రిత పంటల విధానాన్ని  వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే అందరికి లాభం

డిమాండ్ ఉన్న పంటలను పండించి  అధిక లాభాలు పొందే ఈ విధానాన్ని రైతు లు అందరూ   స్వాగతిస్తున్నారని గుత్తా అన్నారు. ఇక  యసంగి సీజన్ లో ప్రతి గింజను  ప్రభుత్వం మే కొనుగోలు   చేసిందని,  ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రతి క్షణం రైతుల కోసమే  ఆలోచన చేస్తున్నారని గుత్తా అన్నారు.

రైతుల పట్ల  ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న కమిట్ మెంట్, ప్రేమ దేశంలో  మరే నాయకుడికి లేదని అన్నారు. రైతుల పట్ల  ప్రభుత్వము  చిత్తశుద్ధి,తో  అంకిత భావంతో    ముందుకు పోతున్న విధానం  అభినందనీయమని అన్నారు. రైతుల విషయం లో రాజకీయాలు చేయకూడదని, రైతు బాగుంటే అందరూ బాగుంటారని అన్నారు.

కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ వైఖరి

పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్ట్ ల  విషయం లో కాంగ్రెస్ నాయకులు  ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని  గుత్తా అన్నారు. పోతిరెడ్డిపాడు  ద్వారా ఆంధ్ర కు నీటిని తరలించే 203 జీవో ను వెంటనే వెనుకకు తీసుకోవాలని జగన్ కు  గుత్తా విజ్ఞప్తి చేసారు.

Related posts

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌

Bhavani

పౌర సదుపాయాల కల్పనకు పెద్ద పేట వేస్తున్నాం

Satyam NEWS

మొక్కలను మనం బ్రతికిద్దాం అవి మనకి బ్రతుకునిస్తాయి

Satyam NEWS

Leave a Comment