29.7 C
Hyderabad
May 1, 2024 03: 51 AM
Slider ముఖ్యంశాలు

గట్టు మట్టి తరలింపు పై తీగ పట్టుకుంటే డొంక కదిలింది..

#kollapurforest

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిలకి వెళ్ళే దారిలో గట్టు మట్టిని రియల్ వెంచర్లకు తరలిస్తున్నారనే సత్యం న్యూస్  కథనానికి స్థానిక తాహాసిల్దార్ చంద్రశేఖర్ స్పందించారు. జెసిబి లతో మట్టిని  తవ్వుతున్న ఘటనాస్థలానికి సోమవారం విర్వోలతో కలిసి తాహాసిల్దారు చంద్రశేఖర్ వెళ్లారు. అక్కడికి చేరుకొని మట్టి తవ్వకం అనుమతులపై ఆరా తీశారు. అందుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. మొత్తం మీద ఆ ప్రాంతం రెవెన్యూ పరిధికి రాదని తేల్చారు. రామాపురం శివారు 209 అటవీ శాఖ పరిధి నుండి మట్టిని తరలిస్తున్నట్లు తహశీల్దార్ గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర రెడ్డి స్పందించారు. అయితే అక్కడ పట్టాలు ఇచ్చినట్లు తెలిసింది. అటవీ శాఖకు చెందిన ప్రాంతంలో  పట్టాలు ఎలా ఇస్తారని అధికారి డైలమాలో పడ్డారు. దీని మీద  విచారణ జరుపుతామని ఆయన తెలిపారు. మొత్తానికి మట్టి తరలింపు వెనుక ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

కామెడీ పండించాడు కంటతడి పెట్టించాడు

Satyam NEWS

కో పిటీషనర్ అయిన నేను నిమ్మగడ్డను కలిస్తే తప్పేంటి?

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులకు MSF సన్మానం

Satyam NEWS

Leave a Comment