34.2 C
Hyderabad
May 16, 2024 17: 58 PM
కవి ప్రపంచం

తేనె కిన్నెర

#N R Tapaswi

(తెలుగు గజల్)       

భావ విప్లవ ప్రసార| బాధ్యత | వహియిస్తేనే

‘ప్లవ’ | నామక | నవీన |  సంవత్సరాది | విలువ !

కట్టుకొని | ప్రదర్శించే | కమలనయన | ఉంటేనే

కంచి | పట్టుచీర | పైటగాలిలోన | చలువ !

ఉదయ | సూర్యబింబానికి | మృదుమధురప్రతీకయై

నింగికి | నేలకు | మధ్యన | నెగడు | ఎర్ర | కలువ !

తల్లి |వోలె | చెల్లి |వోలె  | ద్రాక్షాప్రియ |వల్లి |వోలె

పురుషుని | ఆలన | పాలన | పూరించును  | చెలువ !

అమాయికలుగా | తోచే | అమ్మాయిల | చేరదీసి

బొంబాయికి | అమ్మివేసి | బోరవిరుచు | తులువ !

తినడు | తాను | పరులెవరిని | తిన నీయడు | హరే రామ !

గడ్డివామి | లోపలి | కుక్క | చందాన | పలువ !

పలుకు | వెలది | పజ్జ  | నిలిచి | సలహాలందిస్తేనే

జీవకోటి | నింపుగా | సృజించ | గలడు | నలువ !

పరులకు | సాయమ్ము సేయ | వెరచబోకుమో | తపస్వి  !

ఎందరికో | జీవితమొక | ఎత్తలేని | సిలువ !!

ఎన్. ఆర్.తపస్వి, వేమూరు, 9985813912

Related posts

కొంగ్రొత్త ఆశల ఉగాది

Satyam NEWS

శుభమస్తు పలికిన సంక్రాంతి

Satyam NEWS

ఓ ప్రేమికులారా! కాస్త ఓపిక పట్టండి!

Satyam NEWS

Leave a Comment