39.2 C
Hyderabad
April 28, 2024 13: 53 PM
Slider కవి ప్రపంచం

కొంగ్రొత్త ఆశల ఉగాది

#Vedardham Madhusudhana Sharma New

శ్రీ శుభకృత్ నామ సంవత్సరమా!
నీకు స్వాగతం సుస్వాగతం.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు
గౌరవాన్ని ఆదరణను కల్పించే
నూతన సంవత్సరమా!
నీకు స్వాగతం.
మంగళకరమైన మామిడి తోరణాలతో
మధుమాసపు కోయిల కూతలతో
హాయిని గొలిపే వాసంత సమీరముతో
కష్ట సుఖాలను సమంగా భరించగలమనే
విశ్వాసాన్ని కలిగించే షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనముతో
పిల్లలూ,పెద్దలూ,చుట్టాలూ,పక్కాల సందడితో
భవిష్యత్తుకు మార్గదర్శనం చేసే పంచాంగ శ్రవణముతో
మది నిండా పరచుకున్న కోటి ఆశలతో
నూతన సంవత్సరమా! నీకు స్వాగతం
భయంకరమైన కోవిడ్ మహమ్మారి జాడ లేకుండా
విద్యాసంస్థలను సక్రమంగా నడిపించి
విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంచి
కార్మిక,కర్షక,ఉద్యోగ,ఉపాధ్యాయుల
ఇక్కట్లకు తొలగింపజేసి
వారి అవసరాలను తీర్చి
ఆనంద పరవశులను చేసి
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించి
నిత్యావసరాల ధరలను నియంత్రించి
బీద మధ్య తరగతి వారి
ముఖాలలో సంతోషాన్ని నింపి
సర్వ ప్రాణులకు మమతానురాగాలను పంచి
అందరిలో ఆనంద భాష్పాలను పూయించి
ఆయురారోగ్యాలను,ధనధాన్యాభివృద్ధిని పెంచి
భారతదేశ కీర్తిని జగమంతా చాటేట్లు
శ్రీ శుభకృత్ నామ నూతన తెలుగు సంవత్సరమా!
నీకు స్వాగతం.సుస్వాగతం.

వేదార్థం మధుసూదన శర్మ, కొల్లాపూర్ 9063887585

Related posts

సాగు కు నాగార్జున సాగర్ కుడికాల్వ నీటి విడుదల

Satyam NEWS

అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు

Sub Editor

కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ రెడ్డి కులస్తులకు కేటాయించాలి

Satyam NEWS

Leave a Comment