37.2 C
Hyderabad
May 2, 2024 11: 07 AM
కవి ప్రపంచం

అక్షరీకరిస్తా

#Madhukar Vidula

ఊపిరి సలపని ఊహలు పగటి కలలై వెక్కిరిస్తుంటే

భవిష్యత్తంతా అంధకారాన్ని తలపిస్తుంటే

ప్రయాణపు అడుగుల్లో గమ్యం కానరాక 

భవిష్యత్ ఆశలకు బిగించుకున్న ఉరితాడు

బానిసకొక బానిసకు ఊడిగం చేయలేక

బిగుసుకుపోయిన బంధాలను ఛేదించలేక

బాధ్యతల చెరసాలలో బంధీగా మారి

చేతకాక చేవలేక చేతులెత్తమంటున్న పిరికితనం

చెదలు పట్టి వెక్కిరించే ఆలోచనల గూడు

గుండెనిండా సుప్రభాతపు ఈసడింపులు

మనసంతా అవమానాల వైరస్ సోకి

మ్యాటరంతా డిలీటైనా మైండ్ ఇన్‌బాక్స్

భూమిపై పడింది మొదలు నిత్య పోరాటం

అడుగడుగునా అవంతరాల సంకెళ్లతో సహవాసం

ఫోల్డర్‌లతో నిండిన డెస్క్‌టాప్‌లా ఖాళీలేని జీవితం

నిరంతరం సంఘర్షణలతో సాగే బతుకు పయనం

మదిలో పరిగెత్తే అక్షరాలు కీబోర్డులో కనిపించక

సహనాన్ని పరీక్షించే మౌజ్‌లా స్ట్రక్ అయిన డాటా

ఎంతకీ ఓపెన్‌కాని ఫైల్‌లా రింగులు తిరిగే మస్తిష్కం

సర్వర్ డౌనయి కుప్పకూలిన నాడీ సిగ్నలింగ్ సిస్టం

ఒకే ఒక్కఛాన్స్ కొత్త బ్రెయిన్ చిప్‌ను సీపీయూలో చేర్చి

డిస్క్‌లనిండా పేరుకున్న వేస్ట్ ఫైళ్లను రీసైకిల్‌బిన్‌లోకి తోసి

నాలోని నాడీవ్యవస్థకు 5జీ అంతర్జాలాన్ని రీ కనెక్ట్‌చేసి

నిప్పులు చిల్చే శాటిలైట్ వేగంతో ఆలోచనలను అక్షరీకరిస్తా.

మ‌ధుక‌ర్ వైద్యుల‌, హైద‌రాబాద్‌, 8096677409

Related posts

మే డే

Satyam NEWS

నిత్య సమరం

Satyam NEWS

శక్తి స్వరూపిణి

Satyam NEWS

Leave a Comment