29.7 C
Hyderabad
April 29, 2024 08: 10 AM
Slider కవి ప్రపంచం

శుభమస్తు పలికిన సంక్రాంతి

#J.ShyamalaSankranti

కొత్త సంవత్సరం వచ్చిందో లేదో

పరుగుపరుగున వాలింది పెద్ద పండుగ

చీకట్లను చీలుస్తూ విచ్చేసిన సూరీడు

భోగి మంటల్లో కొవిడ్ పీడ వదిలేనా?

ముగ్గులేస్తున్నా మదిలో మళ్ళీ రేగుతున్న మనోగాయాలు

భయం భయంగా పట్నం నుంచొచ్చిన బిడ్డలు

ఆనందంగా ఆలింగనం చేసుకునే వేళ

‘మత్ కర్నా’ ఆపిన హెచ్చరిక

సానిటైజర్ ఇస్తూ కుశల ప్రశ్నలు

నలుగురు కలిసి నవ్వే వేళ

ఓదార్పులకే అంకితమైంది

పంచభక్ష్య పరమాన్నాల్లేవ్

బతికున్నాం అది చాలు

బలుసాకే పదివేలు

పతంగుల పండుగయినా

ఇప్పుడు బతుకే గాలిపటమయిందిగా

కానీ ఒకే ఒక్క సంతోషం

సంక్రాంతి వస్తూ వస్తూ తెచ్చిందిగా వాక్సిన్

ఇక అంతా సురక్షితమన్న ఆశ

ఉత్తరాయణంతో

శుభం పలుకుతున్న సంక్రాంతీ

నీకు షుక్రియా!

-జె.శ్యామల

Related posts

రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Satyam NEWS

సినిమా హీరోగా మారుతున్న నిజ జీవితం హీరో

Satyam NEWS

నటుడిగా రాణించాలనుకుంటున్న మరో ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి

Satyam NEWS

6 comments

Mramalakshmi January 15, 2021 at 10:03 PM

సంక్రాంతి కవిత బాగుంది.సరళమైన పదాలతో వాక్సిన్ వచ్చిన ప్రస్తుత సానుకూల పరిస్థితిని జోడించి అందించిన నా మిత్రురాలు శ్యామల మేడంకి ధన్యవాదములు ??

Reply
vidadala sambasivarao January 16, 2021 at 1:10 PM

శ్రీమతి శ్యామల గారి సంక్రాంతి కవిత చాలా బాగుంది.2021 ఆశావహ దృక్పథం కవితా పంక్తులలో స్పష్టంగా కనిపించింది.
కళాభివందనములతో
విడదల సాంబశివరావు.

Reply
Rajeswari January 16, 2021 at 7:36 PM

Meeru anni subjects ni enta baga varnistaro corona vaccine ni kooda anta baga varnincharu sankranthi pandaga roju really nice

Reply
Deepa January 16, 2021 at 9:17 PM

I enjoyed reading this poem with a hopeful end!

Reply
Ramana Velamakakanni January 17, 2021 at 12:03 PM

Good poem by Syamala Garu with proactive thought. Abhinandanalu.

Reply
Ramana Velamakakanni January 17, 2021 at 12:04 PM

Very good poem by Syamala Garu with proactive thought. Abhinandanalu.

Reply

Leave a Comment