33.2 C
Hyderabad
May 14, 2024 12: 58 PM
Slider కవి ప్రపంచం

ఓ ప్రేమికులారా! కాస్త ఓపిక పట్టండి!

#polayya kavi

పిల్లగాలి వీస్తుంటే

చల్లని వెన్నెల కాస్తుంటే

తెల్లని మంచు కురుస్తుంటే

మసక మసక చీకటి

మత్తెక్కిస్తుంటే గుభాళించే

మల్లెపూల పరిమళాలు

గుండెల్లో గుబులు రేపుతుంటే

మంచు ముక్కలాంటి

గంధపు చెక్కలాంటి

చక్కని చుక్క ప్రక్కనేవుంటే

చిరునవ్వులు చిందిస్తువుంటే

చిలిపిచేష్టలతో

ఒళ్ళంతా జిల్లంటుంటే

ఆహా ఒళ్ళంతా

ఎంత తుళ్ళింత ! ఏమి గిలిగింత

ఎంత హాయి ! ఎంత హాయి!

ఎంత మధురమీరేయి! అంటూ

పరవశించిపోయే ఓ ప్రేమికులారా!

చూడ చక్కనైనవాడు 

వెచ్చని వెన్నెల్ని కురిపించి

మీ ముద్దు ముచ్చట తీర్చే

ఆ అందాల చందురూడు

హఠాత్తుగా కనిపించకుండా

పోయాడని కలత చెందకండి

అందుకే ఓ ప్రేమికులారా!

ఆగండి కాస్త ఓపిక పట్టండి!

ఎక్కడికెళ్ళలేదు

చుక్కల్లో చంద్రుడు

మీ ప్రక్కనే వున్నాడు

మబ్బుల మాటున దాగిన్నాడు  

కారుమబ్బులు కరిగిపోతే 

తిరిగి మళ్ళీ మిమ్మల్ని

మత్తులో ముంచెత్తుతాడు

మీచే చిందులు వేయిస్తాడు

మిమ్మల్ని చిత్తుచిత్తు చేస్తాడు

అందుకే ఓ ప్రేమికులారా!

ఆగండి కాస్త ఓపిక పట్టండి!

పగలు రేయి

కౌగిలిలో కరిగిపోయే

కోర్కెలతో రగిలిపోయే

కొత్త జంటలచే

జన్మజన్మలకు మనమే

జతగా వుందామంటూ

ప్రమాణం చేయిస్తాడు

అందుకే ఓ ప్రేమికులారా!

ఆగండి కాస్త ఓపిక పట్టండి!

పోలయ్య  కవి, కూకట్లపల్లి, అత్తాపూర్, హైదరాబాద్, 9110784502

Related posts

క్వారంటైన్ లో ఉన్న 11 మంది ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి

Satyam NEWS

శ్రీకాకుళం జిల్లాలో హోలీ రోజు విషాద సంఘటన

Satyam NEWS

లివర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సహాయం చేయండి

Satyam NEWS

Leave a Comment