అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి కొత్త వివాదంతో చిక్కకున్నాడు. రాష్ట్ర హైకోర్టు కు మూడు బెంచిలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఆయన ఒకే వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోల్చడంతో న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి అమరావతి, విశాఖ పట్నం రెండు చోట్లా ప్రత్యేకంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం సూచన ప్రాయంగా చెప్పింది. మూడు చోట్ల హైకోర్టు బెంచ్ ఏర్పాటు నేపథ్యంలో ఒకే వ్యక్తి మూడు వివాహాలు చేసుకున్నట్లు ఉందని పార్ధసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్థసారథి వ్యాఖ్యలపై లాయర్లు భగ్గుమన్నారు.