34.2 C
Hyderabad
May 16, 2024 19: 07 PM
Slider గుంటూరు

జగన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తి వల్లే రాష్ట్రానికి కరెంట్ కష్టాలు

#tdpnrt

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నియోజకవర్గంలోని తుంగపాడు, అల్లూరివారిపాలెం గ్రామాలలో సోమవారం రాత్రి టిడిపి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డా౹౹చదలవాడ అరవింద బాబుకు టిడిపి నాయకులు,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో ని ఎన్టీఆర్ విగ్రహానికి, మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డా౹౹చదలవాడ మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు.టీ డీపీ హయాంలో పట్టణాలలో పెట్టిన అన్న క్యాంటిన్లు వైసిపి ప్రభుత్వం మూసివేయించదని అన్నారు. రూ.5కే పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటిన్లు మూసివేయటం తో వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగనన్న క్యాంటిన్లు పెడతారని ఆశపడితే నిరాశ మిగిలిందని అన్నారు.

ఏరులై పారుతున్న గంజాయి, మద్యం

రాష్ట్రంలో ఇసుక, మంచినీటికి కొరత ఏర్పడిందని అయితే మద్యం,గంజాయి ఏరులై ప్రవహిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో వైసిపి నాయకులు మద్యం,గంజాయిని విక్రయించి లాభపడుతున్నారని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వాళ్ళ అనుచరులు ఆధ్వర్యంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు.వీటి వలన విద్యార్థులు చెడిపోతున్నారని అన్నారు.

రాష్ట్రంలో మహిళలు,బాలికల పై లైంగిక దాడులు వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులు అధికార పార్టీ తొత్తులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.టీడీపీ నాయకులు ఎక్కడకు వెళ్ళుతున్నారో నిఘా పెడుతున్నారని ఆరోపించారు.మహిళల బాలికల, లైంగిక వేధింపులు దాడుల పై నిఘా పెడితే నివారించవచ్చునని అన్నారు.

రాష్ట్ర దిశను మార్చి అభివృద్ది బాటలో నడిపించగల ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడు అని కొనియాడారు. వైసిపి ప్రభుత్వాని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల టీడీపీ నాయకులు ఉడతా రాఘవ, బొడ్డపాటి సుబ్బారావు,లింగ పున్నయ్య,ఏనుగంటి నాగరాజు, ఏనుగంటి మల్లికార్జున రావు, కొండలు, పిన్నింటి చౌడయ్య,నాగరాజు,దామచర్ల నరసింహ రావు,కురపాటి శ్రీను,గంగా పున్నారవు,సాయి,పార్వతమ్మ మరియు మొండితోక రామారావు, కొల్లి బ్రహ్మయ్య,పులుకురి జగ్గయ్య,పులిమి రామిరెడ్డి,కుమ్మేత కోటి రెడ్డి,చల్లా సుబ్బారావు,నవీన్ కుమార్,గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,మన్నన్ షరీఫ్,మబు,పెరికాల రాయప్ప, రమేష్, సుభాని, సాంబయ్య,బంగారం భారీ ఎత్తున తెలుగు మహిళా మణులు పాల్గొన్నారు.

Related posts

సాగర్ ఎడమ కాలువకు నీరు వదలి రైతులను ఆదుకోవాలి

Satyam NEWS

ఉత్త‌మ ర్యాంకులు సాధించిన గిరి పుత్రులు…!

Satyam NEWS

19 నుంచి ఏపి శాసనసభ సమావేశాలు?

Satyam NEWS

Leave a Comment