30.7 C
Hyderabad
April 29, 2024 03: 44 AM
Slider ఆంధ్రప్రదేశ్

19 నుంచి ఏపి శాసనసభ సమావేశాలు?

#Y S Jaganmohan Reddy

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల మూడోవారంలో ప్రారంభంకానున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరించి శాసనసభను ఎలా నిర్వహించాలనే అంశంపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలో సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 19న పోలింగ్‌కు ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నందువల్ల ఆ రోజుకు అటూఇటుగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడంపై చర్చించారు.

ఈ నెల 13 లేదా 16న సమావేశాలను ప్రారంభించే అవకాశం ఉంది. 19వ తేదీ నుంచే ప్రారంభిస్తే 26 వరకు కొనసాగించవచ్చన్న ప్రతిపాదనపై కూడా చర్చించారు. మొత్తమ్మీద వారం రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కచ్చితమైన తేదీని నేడో రేపో ప్రకటిస్తారు. శాసనసభ వ్యవహారాలు, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ శ్రీనివాసులు తదితరులు ముఖ్య మంత్రితో సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

5 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

భీమా క్రికెట్ క్లబ్ టీం కు కిట్ పంపిణీ చేసిన మంత్రి వేముల

Bhavani

ప్రజా సంక్షేమమే నరేంద్రమోదీ ప్రభుత్వ ధ్యేయం: బీజేపీ

Satyam NEWS

Leave a Comment