42.2 C
Hyderabad
May 3, 2024 16: 53 PM
Slider నల్గొండ

సాగర్ ఎడమ కాలువకు నీరు వదలి రైతులను ఆదుకోవాలి

#BJP Nalgonda

నాగార్జునసాగర్ ఎడమ కాలువ క్రింద ఉన్న రైతాంగం ప్రధాన సమస్యలపై చర్చించేందుకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు  ముసుకుల చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. కాలం సమీపించినా ప్రధాన సమస్య సాగునీరు వదలక పోవడం, ఆగష్టు నెలలో రైతన్నల వరినాట్ల తరుణంలో నేటికీ టీ ఆర్ ఎస్ ప్రభుత్వం సాగర్ ఏడమ కాలువకు నీరు వదలకపోవటం చూస్తూంటే ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.

నేటికీ రైతులు వరినారు మళ్ళు కూడా పోయ లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రైతులు పెద్దయెత్తున నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఏ పంట అయిన సరైన సమయంలో వేస్తేనే రైతన్న కష్టానికి ఫలితం ఉంటుందని, కానీ ప్రభుత్వ నిర్లక్షం కారణంగా రైతన్నలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు.

పాలకులు నిద్రావస్థ నుండి మేలుకొని తక్షణమే సాగర్ ఏడమ కాలవకు నీటిని విడుదల చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  రామరాజు ఇంటిరవి జి.సతీష్ శివచారి, స్థానిక బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కన్నీటి నివాళి…

Satyam NEWS

ఇంటర్నల్ వార్ :లండన్‌లో ముగ్గురు సిక్కుల హత్య

Satyam NEWS

పాలనా లోపం ప్రజలకు శాపం

Bhavani

Leave a Comment