25.2 C
Hyderabad
May 16, 2024 19: 37 PM
Slider ప్రత్యేకం

‘మన ఊరు-మన బడి’లో పూర్వపు విద్యార్థులు భాగస్వాములు కావాలి

#ministerniranjanreddy

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు ఎన్నారైలు భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదని చెప్పారు.

మన ఊరు- మన బడి’ మన బస్తి- మన బడి కార్యక్రమంపై బుధవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని సాయి గార్డెన్ లో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీడీవోలు, ఎంఈఓలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుపై అనేక అనుమానాలు వ్యక్తంచేసిన పరిస్థితి నుంచి దేశంలోనే ఒక రోల్‌ మోడల్‌ రాష్ట్రంగా రూపాంతరం చెందామన్నారు.

భారీ ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యవసాయం, సంక్షేమం వంటి రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యం వంటి రంగాల్లోనూ విప్లవాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని మంత్రి  అన్నారు.

విద్యారంగంలో విశేష మార్పులు

విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని, ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకొని మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీల వరకు నూతనంగా వందలాది విద్యాసంస్థలను ఏర్పాటు చేశామని, లక్షలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని సర్కారును బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ మన బస్తి మనబడి కార్యక్రమం చేపట్టిందని వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.7289 కోట్లతో సుమారు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు.

అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు.12 వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు రూపకల్పన చేసిందని తెలిపారు.

విద్యావ్యవస్థ బలోపేతానికి అందరూ సహకరించాలి

ఈ నేపథ్యంలోనే గ్రామీణ స్థాయి బడుల్లో చదువుకొని  ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి చెందిన పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని అందించేలా క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్‌ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా పాఠశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని  కోరారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని మంత్రి  అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు త్వరలోనే సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ సమాజానికి అవసరమైన 100% అక్షరాస్యత అందించే విధంగా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

గ్రామ సర్పంచులు విద్యా కమిటీ చైర్మన్ లకు ప్రభుత్వం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు, జీవోను తెలుగులో అనువాదం చేసి అందించాలని డీఈఓ ను ఆదేశించారు. ప్రభుత్వం స్పష్టంగా మార్గదర్శకాలను విడుదల చేసిందని తదనుగుణంగా పనులు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

శిధిలావస్థలో ఉన్న తరగతి గదులను తొలగించాలి

రెండో విడతలో నూతన పాఠశాలల గదుల నిర్మాణాలను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. శిథిల వ్యవస్థలో ఉన్న పాఠశాలల తొలగింపు అనుమతుల్లో జాప్యం లేకుండా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఇదొక చారిత్రక కార్యక్రమం గా భావించి ప్రతి ప్రజా ప్రతినిధి అధికారులు పనిచేయాల్సి ఉంటుందని సూచించారు.

ప్రజాప్రతినిధులందరూ క్షేత్రస్థాయిలో పాఠశాలలను పర్యటించి పటిష్ట పరచాలి అన్నారు. రానున్న రోజుల్లో ఆంగ్ల మాధ్యమ బోధన తో పాటు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు విద్యను అందించేలా ప్రభుత్వ బడులు మారం ఉన్నాయని వెల్లడించారు.

ఆ దిశగా రాష్ట్ర ఐటి శాఖ విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిథి ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా విద్యకు అధిక ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో ఉండేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజును తెలంగాణ రైతు దినోత్సవం గా ప్రకటించాలని వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు. పాఠశాలల ఎంపిక  సమయంలో అధికారులు క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన చేసుకొని ఎమ్మెల్యేలను సంప్రదించి ప్రకటించాల్సి ఉండేదన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టాలన్నారు. రానున్న రోజుల్లో పనులు పూర్తి అయ్యేలా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లె ప్రగతి పనులను నిర్వహించిన మాదిరిగానే విజయవంతం చేయాలన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో 290 స్కూళ్ల ఎంపిక

కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న మన ఊరు మన బడి కార్యక్రమాన్ని జిల్లాల్లో 290 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మంత్రి సూచనల మేరకు రానున్న 90 రోజుల్లో పనులను పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థులకు అందించేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని తెలిపారు.

ప్రతి అధికారి, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ పనుల పూర్తి త్వరితగతిన గా నాణ్యతతో పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. ప్రజాప్రతినిధుల సూచనలను పాటిస్తూ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలతో ప్రభుత్వం కల్పిస్తున్న పనులను నాణ్యతతో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఎంపిక చేసిన పాఠశాలలను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీ చేసి ఎంపిక చేయండి పాఠశాలల్లోనూ ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

తన నియోజకవర్గ పరిధిలో కొన్ని పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటిని వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్,కోడేర్ మండలాల్లో కొన్ని పాఠశాలలు శిథిల వ్యవస్థ లో ఉన్నాయని వాటిని ఎంపిక చేయలేదని వాటిని సైతం ఎంపిక చేయాలని కోరారు.

కల్వకుర్తి జడ్ పి టి సి భరత్ ప్రసాద్ అన్ని పాఠశాలలో ఉన్న మూత్రశాలల సమస్యలను తీర్చాలని కోరారు. పదర జడ్పిటిసి రాంబాబు మధ్యాహ్న భోజన పథకంలో అందిస్తున్న గుడ్లకు సరిపడ అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మను చౌదరి, రాజేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

మైదానంలో మళ్లీ స్టెప్పులేసిన కోహ్లీ

Sub Editor

దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం: సీరీస్ కైవసం

Satyam NEWS

వనపర్తిలో ప్రశ్నించిన వారిపై కేసులు:రాచాల

Satyam NEWS

Leave a Comment