38.2 C
Hyderabad
April 29, 2024 22: 16 PM
Slider గుంటూరు

అట్టహాసంగా ప్రారంభమైన పల్నాటి సంబరాలు..

#palanaducelebrations

ఒంగోలు గిత్త పేరు చెబితేనే గుర్తుకు వచ్చేది రాజసం, పౌరుషం, బలంగా, దృఢంగా.. కండపట్టి ఉండే శరీర సౌష్టవం. పొట్టిగా… గట్టిగా ఉండే కొమ్ములు. ఎత్తైన మూపురం.. వేలాడే గంగడోలు.. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ఒంగోలు గిత్త రైతు ఇంటి ముందుంటే అదో రాజసం. ఎంతటి బరువైనా అవలీలగా లాగే తత్వం, లోతుగా దుక్కి చేసేందుకు కిలోల కొద్దీ బరువు పెట్టినా ఇట్టే దున్న గల శక్తి, బండి కడితే గంటకు కనీసం 30 మైళ్ల వేగంతో పరుగు తీయ గల సామర్థ్యం. కయ్యానికి కాలు దువ్వితే వెనుకడుగేయని నైజం.

ఇవి ఒంగోలు గిత్తలకుండే గొప్ప లక్షణాలు. అలాంటి ఒంగోలు గిత్తలు పల్నాటి ముఖద్వారాన రంకేలేస్తూ.. కథన రంగంలో సై అంటూ కాలుదువ్వుతుంటే.. చూడటానికి రెండు కళ్లు చాలవు కదా… ఇంతటి కోలాహల సంబరం గూంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని జిల్లా క్రీడా ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎడ్ల పోటీలను ప్రారంభించారు. సంబరాల్లో భాగంగా స్టేడియం ఆవరణలో వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రారంభించారు.

నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించిన సీఎంకు ఎమ్మెల్యే గోపిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు వాసుల కల నెరవేర్చారిన సీఎం ను గుండెల్లో పెట్టుకుంటాం అన్నారు. ఎడ్ల పోటీల్లో గతేడాది 160 ఎడ్ల జత పందెంలో పాల్గొన్నాయి అని.. ఈ సారి ఆ సంఖ్య 200 కి చేరి లిమ్కా బుక్ ఆఫ్ రికర్డ్స్ ను తిరగ రాయాలని అన్నారు. కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న కమిటీ కి అభినందనలు తెలిపారు. 15 రోజుల నుంచి బాగా కష్టపడ్డారాని ప్రశంసించారు. పల్నాటి చరిత్ర ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పల్నాటి, రాయల సీమ కి పౌరుషాల్లో చాలా దగ్గర  సంబంధాలు ఉన్నాయన్నారు. జగన్ పాలనలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు.

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగల సంబరాలు జరుగుతున్నాయి అని అన్నారు. పల్నాటి పౌరుషానికి అభివృద్ధిలో, ప్రజల సంక్షేమం లో చూపిస్తున్న ఆ వ్యక్తి గోపిరెడ్డి అని అన్నారు. సంక్షేమ పథకాలు పండుగల  ప్రజల వద్దకు వస్తున్నాయి అన్నారు. జన రంజక పాలన జగన్ అందిస్తున్నారని వివారించారు. రాబోయే రోజుల్లో మరింత మాజీ పాలన అందిస్తామని..  పల్నాడు మరింత అభవృద్ధి జరగాలి అని అన్నారు.

నరసరావుపేట కేంద్రంగా జరుగుతున్న పల్నాటి సంబరాలు దిగ్విజయంగా సాగాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆకాంక్షించారు. పల్నాడు సంస్కృతిని కాపాడుతూ మనందరం వాటిని ముందుకు తీసుకెళ్తున్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి పూర్తి మద్దతు తెలపాలని అన్నారు. అందరు పట్టుబట్టి పల్నాటి సంబరాలను కొనసాగించడం అభినందనీయం అన్నారు. ముందు ముందు రాష్ట్రలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఈ పల్నాటి సంబరాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి కోరారు. కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు,  మాజీ సర్పంచ్లు, పట్టణంలోని నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్

Related posts

పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి: సిపిఐ

Satyam NEWS

ఎఫ్‌.3 : పూజా హెగ్డే పార్టీ సాంగ్ షూటింగ్ ప్రారంభం

Satyam NEWS

అంతర్జాతీయ ఈత పోటీలకు నరసరావుపేట క్రీడాకారుడు

Satyam NEWS

Leave a Comment