24.7 C
Hyderabad
May 16, 2024 23: 35 PM
Slider విజయనగరం

“స్పందన” ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలి

#spandana

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ  ఎం. దీపిక  నిర్వహించారు. ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీకి 31 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

ఎస్.కోటకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ ఒక వ్యక్తి కలెక్టరు ఆఫీసులో కంప్యూటరు ఆపరేటర్ ఉద్యోగం కల్పిస్తానని, నమ్మించి, 3 లక్షలు తీసుకున్నట్లు, ఇంతవరకు ఎటువంటి ఉద్యోగం కల్పించలేదని, తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వకుండా తనను మోసం చేసారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఎస్.కోట సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు కాటవీదిలో 70 గజాల ఇంటి స్థలం ఉన్నట్లు, సదరు స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించగా, అదే ప్రాంతానికి చెందిన ఒకామె అడ్డుకుంటూ, తన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ ఎస్ఐను ఆదేశించారు.

బొండపల్లి మండలం మరువాడ కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు వారసత్వం గా వేపాడ మండలం బొద్దాం గ్రామంలో 2-40 ఎకరాల భూమి కలదని, సదరు భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి, ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని వల్లంపూడి ఎస్ఐను ఆదేశించారు.

మెంటాడ మండలం, ఆండ్రకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే గ్రామానికి చెందిన వ్యక్తి అవసరాల నిమిత్తం రెండు లక్షలును అప్పుగా రెండు సం.ల క్రితం ఇచ్చినట్లు, సదరు వ్యక్తి తిరిగి తీసుకున్న అప్పును, వడ్డీని చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఆండ్ర ఎస్ఐను ఆదేశించారు. విజయనగరం  కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఇల్లు ఖాళీ చేయమన్నందుకు తనపై వన్ టౌన్ సీఐ పోలీసు స్టేషనులో తప్పుడు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయిస్తానని, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేసి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదకి న్యాయం చేయాలని, విజయనగరం వన్ టౌన్ సీఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ ఇంటి ముందున్న తన ఖాళీ స్ధలంలో చుట్టు ప్రక్కల ఉన్న కొంత మంది వ్యక్తులు నీళ్ళ కుండి, కుళాయి, డ్రమ్ములను అడ్డంగా పెట్టి తన ఇంటిలోకి వెళ్ళడానికి దారి లేకుండా చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారని, అడిగితే తనతో గొడవపడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని, విజయనగరం టూటౌన్  ఎస్ఐని ఆదేశించారు.

“స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, దిశ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఎస్బీ సిఐలు కే.కే.వి. విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి, డిసిఆర్బీ ఎస్ఐలు వాసుదేవ్, ప్రభావతి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి

Bhavani

రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నిందితుడి మృతి

Bhavani

ఏపీ డీజీపీపై కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment