42.2 C
Hyderabad
May 3, 2024 16: 23 PM
Slider నిజామాబాద్

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

#gampagovardhan

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన కల్లాల నిర్మాణాలకు ఖర్చు చేసిన 151 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ మాట్లాడుతూ.. ఈ దేశంలో ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉందొ చూస్తూనే ఉన్నామన్నారు. ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సమృద్ధి పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. కేంద్ర మంత్రులు, అధికారులు, పక్క రాష్ట్రాల నాయకులు తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రశంసిస్తూ కితాబిచ్చారన్నారు.

పార్లమెంట్ సాక్షిగా అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని చెప్పిన ప్రధానికి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సంతోషాన్ని చూడలేక పోతున్నారా.. ఈ కుళ్లు బుద్ది మీకెందుకు అని నిలదీశారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటవరకు ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించని ఏకైక ప్రధాని మోడీ అన్నారు. కేసీఆర్ రైతు బాంధవుడని, ఇప్పుడిప్పుడే రైతులు అప్పుల ఊబిలో నుంచి బయటపడుతున్నారని చెప్పారు. అది చూసిన బీజేపీ ఓర్వలేవుఅపోతుందని, పని చేసే ప్రభుత్వానికి కాళ్ళలో కట్టెలు పెడుతోందన్నారు.

75 సంవత్సరాల చరిత్రలో ఏనాడైనా రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని ఏ నాయకునికైనా ఆనిపించిందా.. గుజరాత్ లో 15 సంవత్సరాలు సీఎంగా, ఎనిమిది సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్న మోడీ గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసారా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఉపాధి హామీ ద్వారా కల్లాల నిర్మాణం చేసి ఉపాధి కల్పిస్తే ఆ నిర్మాణాలకు ఖర్చు చేసిన 151 కోట్ల రూపాయలు కేంద్రానికి కట్టాలంటున్నారని తెలిపారు.

ఆ అడబ్బులేమైనా నీ తాత జాగీరా మోడీ అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి పన్నుల రూపేణా కేంద్రానికి 2.79 లక్షల కోట్లు చెల్లిస్తే కేంద్రం తెలంగాణకు ఇచ్జింది మాత్రం 1.60 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. మా డబ్బులు ఎటు పోయాయి.. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో ఎంతోమంది ప్రదానిలను చూశామని, తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చేసిన ప్రధానిని ఇప్పుడే చూస్తున్నామన్నారు.

కర్ణాటక, మహారాష్ట్రలో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వాటిపై ప్రధాని ఎందుకు మాట్లాడరని నిలదీశారు. ఈడీ, సిబిఐ, ఐటీలను ఉసిగొల్పడమే మీకు తెలుసన్నారు. కేంద్రంలోని బీజేపీ సీఎం కేసీఆర్ ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా గుండె ధైర్యంతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఇంకా బాగా పనిచేసి తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు. కేంద్రం కట్టాలన్న 151 కోట్లు రద్దు చేసేవరకు ఈ పోరాటం ఆపేది లేదని, రైతాంగం అంత ఏకం అవుదామని, కేంద్రంపై తిరగబడదామని పిలుపునిచ్చారు.

Related posts

క్వశ్చన్: తిరుమల తిరుపతి దేవస్థానంపై సీక్రెట్ ఎందుకు?

Satyam NEWS

మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజును కలిసిన హీరో ఇంద్రసేన

Satyam NEWS

మోసపోయిన మౌనిక దీక్షకు ప్రజాసంఘాల మద్దతు

Satyam NEWS

Leave a Comment