25.2 C
Hyderabad
May 16, 2024 21: 41 PM
Slider విజయనగరం

విజయనగరంలో విప్లవ జ్యోతి అల్లూరి విగ్రహావిష్కరణ

#ministerbotsa

ఎవరి పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతుందో… ఎవరు విల్లు ఎక్కుపడితే బ్రిటిష్ గుండెలదురేవో…అతగాడే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.

ఆయన విగ్రహాన్ని విజయనగరం జిల్లా కేంద్రం దాసన్నపేట రైతు బజార్ వద్ద ప్రారంభించారు… విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

ఆయ‌న వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని స్థానిక దాస‌న్నపేట రైతు బ‌జార్ కూడలిలో క్ష‌త్రియ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన విగ్ర‌హాన్ని మంత్రి బొత్స‌, స్థానిక ఎమ్మెల్యే వీర‌భ‌ద్ర స్వామి, ఎమ్మెల్సీ ర‌ఘురాజు, క్ష‌త్రియ సేవా స‌మితి స‌భ్యుల‌తో క‌లిసి లాంఛనంగా ప్రారంభించి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

విగ్ర‌హ ఏర్పాటుకు అల్లూరి సీతారామరాజు సేవా స‌మితి స‌భ్యులు 10 ల‌క్ష‌లు వెచ్చించ‌గా చుట్టూ ర‌క్ష‌ణ క‌వ‌చం, ఫౌంటేన్ ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ 15 ల‌క్ష‌లు కేటాయించ‌టం ద్వారా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం మంత్రి బొత్స‌, పార్టీ నేత‌లు, అధికారులు అల్లూరి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల్లో స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. ఆయన త్యాగం మరువలేనిదని ఆయన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి అన్నారు.

అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సేవలను, త్యాగాలను కొనియాడారు.ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, పాకలపాటి రఘువర్మ, ఇందుకూరి ర‌ఘురాజు, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, అల్లూరి సీతారామరాజు సేవా స‌మితి స‌భ్యులు కేఏసీ రాజు, ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎస్‌. రాజు, స్థానిక కార్పొరేట‌ర్లు, మున్సిపాలిటీ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యాభివృద్ధి

Satyam NEWS

కేటీఆర్ ను కలిసిన అరూరి

Bhavani

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై  మంద కృష్ణ  విమర్శలు

Satyam NEWS

Leave a Comment