29.7 C
Hyderabad
April 29, 2024 07: 31 AM
Slider నల్గొండ

అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యాభివృద్ధి

#NationalEducationDay

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్  జయంతి సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా మసీదులో  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీల రాష్ట్ర నాయకులు ఎండీ. అజీజ్ పాషా మాట్లాడుతూ మౌలానా జన్మదినమైన నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రముఖ స్వాతంత్య సమర యోధుడని, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి గా పనిచేశారని అన్నారు.

ఆయన అసలు పేరు ‘మొహియుద్దీన్ అహ్మద్’, ‘అబుల్ కలాం’ అనేది బిరుదు, ‘ఆజాద్’ కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించారని,ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి అబుల్ కలామ్ ఆజాదని అన్నారు.

భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖా మంత్రిగా పనిచేశారని, అబుల్ కలామ్ ఆజాద్ అల్-హిలాల్, అల్-బలాగ్ అనే పత్రికలు స్థాపించారని,గాంధీజీ, నెహ్రూ మౌలానా, మీర్-ఎ-కారవాన్‌ అని పిలిచేవారని, 1992లో భారత ప్రభుత్వం మౌలానా కు  భారతరత్న ఇచ్చి గౌరవించిందని అన్నారు.

దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడుతూ ఆయన్ని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎంఏ. అబ్దుల్ రహీమ్,పఠాన్ గౌస్ ఖాన్, ఎస్ కే. రహమతుల్లా,md.అక్బర్,ఎస్కే. జానీ,ఎండీ సిరాజ్,ఎస్ కే. జాఫర్,Sk.మీరా,md. బాబా,ఎస్కే రసూల్, ఎస్కే. నయీమ్,మెయిన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

19న 5కె రన్

Bhavani

ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలి

Bhavani

తెలంగాణ లో రేపటి నుంచి స్కూళ్లు బంద్

Satyam NEWS

Leave a Comment