28.7 C
Hyderabad
April 28, 2024 06: 23 AM
Slider మహబూబ్ నగర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై  మంద కృష్ణ  విమర్శలు

#mandakrishnamadiga

వనపర్తిలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రాజనగరం రాజేష్ మాదిగ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్ జి గార్డెన్లో విలేకరులతో మందకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో అనాధలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించి అన్ని విధాల ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కెసిఆర్ ఈ హామీ ఇచ్చి నేటికీ 7 ఏళ్ల 7 నెలల తొమ్మిది రోజులు అవుతుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు దాదాపు పది లక్షల మంది వరకు ఉన్నారని వీరి విషయంలో కెసిఆర్ మంత్రివర్గం తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం కూడా అమలు కాలేదని తెలిపారు. ప్రతి జిల్లాలో మొదట యాదాద్రిలో రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. అనాథల పట్ల కెసిఆర్ మొసలి కన్నీరు కార్చారే తప్ప తీసుకున్న చర్యలేం లేవని, ఒక అనాధాశ్రమాన్ని కూడా సందర్శించలేదని విమర్శించారు. అనాథల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పి మోసం చేశారని కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారికి స్మార్ట్ కార్డులు ఇస్తామని మంత్రివర్గ ఉప సంఘం తీసుకున్న నిర్ణయాలు తీర్మానాలు అమలు చేయలేకపోయారని విమర్శించారు. ఇప్పటికైనా అనాధలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈనెల 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరవధిక దీక్ష చేపడతామని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు 1996 నుండి దేశంలో జరిగినటువంటి అనేక ఎన్నికల మేనిఫెస్టోలలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు తెలుపుతూనే మాదిగలను మోసగించడం నేటికీ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో భాజపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.   భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునే ప్రతి ఒక్కరి నుండి గట్టి సమాధానం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

ఈ  కార్యక్రమంలో స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సీనియర్ నాయకులు కొమ్ము చెన్న కేశవులు మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గంధం లక్ష్మయ్య మాదిగ, మంద నరసింహ మాదిగ, చందాపూర్ రాములు మాదిగ, మాదిగ మహిళ సమాఖ్య రాష్ట్ర నాయకురాలు సువార్తమ్మ, జగదీష్ మాదిగ, ముప్పూరి పురుషోత్తం మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతియ నాయకులు గట్టు స్వామి మాదిగ మహాజన సోషలిస్టు జిల్లా నాయకులు గంధం లక్ష్మయ్య మాదిగ వికలాంగుల హక్కల పోరాట సమితి జిల్లా సీనియర్ నాయకులు మీసాల నాగరాజు మాదిగ,ఎమ్మార్పిఎస్ జిల్లా సీనియర్ నాయకుడు మొలకలపల్లి పరుశురాం మాదిగ,మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ములుగు జిల్లాలో ఉపాధి హామీ నిధులతో పక్కా రోడ్లు

Satyam NEWS

ప్రజలకు వాస్తవ సమాచారం ఇచ్చి భయం పోగొట్టండి

Satyam NEWS

పింక్ డైమండ్ పై తొలిసారి వ్యాఖ్యానించిన చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment