38.2 C
Hyderabad
April 29, 2024 14: 17 PM
Slider ప్రత్యేకం

హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి…!

#haritaharam

తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే పచ్చతోరణంగా నిలపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలవుతోన్న ఈ కార్యక్రమ లక్ష్యం అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది.‌ హరితహారం కార్యక్రమంలో భాగంగా గద్వాల జిల్లా కేటిదొడ్డి, ధరూర్ మండలాలోని ఆయా గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుటకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వలన నీరు గారిపోతున్నది.

అధికారుల టార్గెట్ పూర్తి చేసుకోవడానికి గ్రామ పంచాయతీ నిధుల నుండి ఇతర రాష్ట్రాల నుంచి మొక్కలు కొనుగోలు చేసి రోడ్డుకు ఇరువైపులా పెట్టినప్పటికీ మొక్కలకు రక్షణ కల్పించకపోవడం, కర్రలు ఏర్పాటు చేయకపోవడం, నీరు పెట్టకపోవడం, పర్యవేక్షణ లోపంతో మొక్కలు దక్కకుండా పోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వలన ప్రజాధనం బూడిద పాలు అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేటిదొడ్డి, ధరూర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాలలో హరిత హారంలో నాటిన మొక్కలు వంగి కింద పడిపోయి ఉండటం, మొక్కలకు రక్షణగా జాలీలు, ముళ్ళకంప, ఏర్పాటు చేయకపోవడం మొక్కలకు నీరు పట్టకపోవడంతో మొక్కలు మొత్తం చనిపోయి కర్రలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజు అధికారులు ప్రయాణించే దారిలో హరితహారం మొక్కలను చూసుకుంటూ వెళ్తున్నారు కాగా మొక్కలను మాత్రం పట్టించుకోకపోవడంతో అధికారుల పనితీరు అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది.

మొక్కల సంరక్షణ బాధ్యతను అధికారులకు అప్పగించడంతో మొక్కల సంరక్షణ కోసం నీటి ట్యాంకర్లతో నీటిని మొక్కలకు అందిస్తూ మొక్కలను కాపాడుతూ వస్తుంది. కాని కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో రోడ్డుకు ఇరువైపుల నాటిన హరితహారం చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామంలో పారిశుద్యం నివారణ చేపటకపోవడంతో పాటు చెత్తను రోడ్డుకు ఇరువైపులా వేయడంతో ప్రమాదవశాత్తు చెత్తకు మంటలు అంటుకోవడంతో హరితహారం మొక్కలకు నిప్పు అంటుకొని పూర్తిగా కాలి పోయాయని గ్రామస్తులు ఆరోపించారు.

ఇలా రోడ్డుకు ఇరువైపులా పలుమార్లు జరిగిన అధికారుల పట్టింపు లేదని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. వివిధ గ్రామపంచాయతీ పరిధిలో మేకలు, గొర్రెలు, మూగజీవాలు హరితహారం మొక్కలను మేసాయని అని ఫిర్యాదు రావడంతో అట్టి యజమానులకు జరిమానాలు వేసిన సందర్భాలు ఎన్నో చూశాం. రహదారులకు ఇరువైపుల ఉన్న హరితహారం మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హరిత ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

గోవా పర్యాటకానికి గ్రీన్‌ సిగ్నల్‌

Satyam NEWS

`ఆర్ఆర్ఆర్` చిత్రం విడుదల వాయిదా

Satyam NEWS

సెలబ్రేషన్ కంటిన్యూస్: వేడుకగా అత్తిరాల రథోత్సవం

Satyam NEWS

Leave a Comment